సినిమా ధియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. దీనితో ఒటిటి ప్లాట్ ఫామ్ ల హవా విపరీతంగా కొనసాగుతోంది. అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి భారీ ఒటిటీ ప్లాట్ ఫామ్స్ మీడియం రేంజ్ సినిమాలను కొనడానికి ఒకొక్క సినిమాకు 20 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారంటే ప్రస్తుతం జనం ఒటిటి ప్లాట్ ఫామ్స్ కు ఏవిధంగా కనెక్ట్ అవుతున్నారో అర్ధం అవుతుంది.


ఇలాంటి పరిస్థితులలో అల్లు అరవింద్ ‘ఆహా’ ను ఈ లాక్ డౌన్ పిరియడ్ ముగిసేలోగా అమెజాన్ నెట్ ఫ్లిక్స్ ల స్థాయికి తీసుకు రావాలని ఈ లాక్ డౌన్ సమయంలో కూడ అన్ని ప్రముఖ ఛానల్స్ లో ఆహా కు సంబంధించిన ప్రకటనలు విపరీతంగా ఇస్తున్నాడు. అయితే ఆహా లో ఉన్న కంటెంట్ అంతగా యూత్ కు కనెక్ట్ అయ్యేవిధంగా లేకపోవడంతో పాటు సినిమాల సంఖ్య చాల తక్కువగా ఉండటంతో ఈలాక్ డౌన్ పిరియడ్ ను ఆహా పూర్తిగా వినియోగించుకోలేకపోతోంది అన్న కామెంట్స్ వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య చిరంజీవి ఈ లాక్ డౌన్ సమయంలో ఒకప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ కు కొత్త ఆలోచనలు కలిగించినట్లు టాక్. ప్రస్తుతం ఒటీటీ ప్లాట్ ఫామ్స్ లో జనం వెబ్ సిరీస్ ను విపరీతంగా చూస్తున్న పరిస్థితులలో మంచికథ ఉంటే తాను వెబ్ సిరీస్ లలో కూడ నటించే ఆలోచన ఉంది అని చిరంజీవి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. 


ఈ మాటలు అరవింద్ కు నూతన ఉత్సాహం ఇవ్వడంతో చిరంజీవి అంగీకరిస్తే ఒక ప్రముఖ డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తో చిరంజీవిని హీరోగా మార్చి ఒక వెబ్ సిరీస్ ను ఆహా కోసం నిర్మించే ఆలోచనలకు సపోర్ట్ ఇవ్వవలసిందిగా అరవింద్ చిరంజీవిని కోరినట్లు టాక్. అరవింద్ దగ్గర నుండి ఇలాంటి సూచన రావడంతో షాక్ అయిన చిరంజీవి ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ అదేవిధంగా త్వరలో నటించబోయే ‘లూసీఫర్’ రీమేక్ తరువాత అరవింద్ సూచనలను ఆలోచిస్తానని ఈలోగా మంచి టాలెంట్ ఉన్న యంగ్ హీరోలతో మంచి వెబ్ సిరీస్ లను నిర్మించి ఆహా ను నిలబెట్టమని చిరంజీవి సలహా ఇచ్చి నట్లు టాక్..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: