సౌత్ క్రేజీ హీరోయిన్స్ లో ఆర్తి అగర్వాల్ ఒకరు. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా ఆర్తి అగర్వాల్ మొదటి సినిమా నుండి స్టార్ క్రేజ్ దక్కించుకుంది. కెరియర్ మొదట్లోనే సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్లిన ఆర్తి అగర్వాల్ దాదాపు అందరి స్టార్స్ తో నటించి మెప్పించింది. అందం అభినయం రెండు ఆమె సొంతం.. స్టార్ హీరో సినిమా అయినా సరే ఆర్తి అగర్వాల్ క్రేజ్ వేరేలా ఉండేది. 

 

కెరియర్ పీక్స్ లో ఉన్న టైం లో ఒక యువ హీరోతో ఆమె రిలేషన్ లో ఉండటం ఆమెని ట్రాక్ తప్పేలా చేసింది. అయితే కొద్దిపాటి గ్యాప్ తో రీ ఎంట్రీ ఇచ్చినా అప్పటికే ఆమె మీద ఫేడ్ అవుట్ హీరోయిన్ ముద్ర పడిపోయింది. ఒకప్పుడు అందాల ముద్దుగుమ్మ అనిపించినా ఆర్తి సరైన డైట్ పాటించకపోవడం వల్ల కొద్దిగా ఫ్యాట్ అయ్యింది. అయినా అప్పటికి సినిమాల్లో నటించాలన్న కోరికతో వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు ఆర్తి అగర్వాల్. 

 

మునుపటి రూపం తెచ్చుకునేందుకు 2015లో లైపో సర్జరీకి వెళ్లిన ఆర్తి హార్ట్ ఎటాక్ తో తుది శ్వాస విడిచారు. ఆర్తి అగర్వాల్ మరణం ఆమె ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సినీ పరిశ్రమకు ఓ పెద్ద షాక్.. భౌతికంగా ఆమె మన మధ్య లేకున్నా ఆమె సినిమాలు చూస్తున్న టైం లో ఆర్తి ఇంకా మనతోనే ఉంది అన్నట్టుగా భావిస్తాం. కెరియర్ లో స్టార్ రేంజ్ తో పాటుగా అవకాశాలు లేని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కున్న ఆర్తి అగర్వాల్ మన మధ్య లేకున్నా సరే ఆమె సినిమాలతో ఆమె ఎప్పుడు ప్రేక్షక హృదయాల్లో నిలిచి ఉంటుంది.             
 

మరింత సమాచారం తెలుసుకోండి: