తెలుగు తెర మీద తమకంటూ ఒక ముద్ర వేసుకున్న హీరోయిన్ లు చాలా మందే ఉన్నారు. అలాగే తమిళంలో కూడా వాళ్ళు ప్రత్యేకంగా అలరించారు మెప్పించారు. తమిళం నుంచి వచ్చి ఇక్కడ తెలుగులో తమకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ లు చాలా మందే ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ నయనతార. ఆమె నటనకు మంచి గుర్తింపు ఉండటమే కాకుండా ఆమె అందానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె సినిమా చేస్తున్నారు అంటే ఆమె అందం కోసం సినిమాకు వెళ్ళే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. 

 

ఆమె చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి మన తెలుగులో. అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేసారు. పొట్టి దుస్తులు వేసినా పెద్ద దుస్తులు వేసినా చీర కట్టినా మరొకటి కట్టినా సరే ఆమె అలా ప్రేక్షకులకు గుర్తుండి పోయారు అనేది వాస్తవం. రవి తేజా తో కలిసి రెండు మూడు సినిమాల్లో ఆమె చేసారు. ఆ రెండు మూడు సినిమాల్లో ఆమె చాలా హాట్ గా కనపడింది అని ప్రేక్షకులు కూడా వ్యాఖ్యానించారు. ప్రధానంగా నయన్ కి యువత లో ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆమె నటన ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. 

 

అగ్ర హీరోయిన్ అయిన తర్వాత కూడా ఆమె అందానికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు ఆమె చాలా సీనియర్ హీరోయిన్. ఆమె కు ఆఫర్లు వచ్చి నా రాకపోయినా సరే ఆమె ఎప్పుడు డీలా పడకుండా సినిమాలు చేసారు. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె ఉంటే ఒక రేంజ్ ఉంటుంది అని ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అగ్ర దర్శకులు ఆమె కోసం చాలా కష్టపడిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. ప్రస్తుతం మన తెలుగులో ఆమె సినిమాలు చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: