‘కార్తికేయ’ మూవీతో తన క్రియేటివిటీని చాటుకున్న చందు మొండేటి ‘ప్రేమమ్’ మూవీతో తాను ప్రేమ సినిమాలను కూడ తీయగల దర్శకుడుని అని నిరూపించుకున్నాడు. నాగచైతన్యతో తీసిన ‘సవ్యసాచి’ మూవీ ఫెయిల్ అయినా ఆవిషయాన్ని పట్టించుకోకుండా ప్రస్తుతం ఈలాక్ డౌన్ పిరియడ్ లో నిఖిల్ తో తీయబోతున్న ‘కార్తికేయ 2’ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. 


ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ సమయంలో తాను పడుతున్న టార్చర్ గురించి మాట్లాడుతూ ఈ క్రియేటివ్ డైరెక్టర్ లాక్ డౌన్ పిరియడ్ లో తనకు సమస్యలు లేకుండా పరోక్షంగా సహకరించి రాజమౌళి సుకుమార్ లు అంటూ కామెంట్ చేసాడు. ఇన్నిరోజులు తాను బయటకు రాకుండా రోజులు గడిపాను అంటే దానికి కారణం ‘బాహుబలి’ సినిమా అని అంటూ ఈ లాక్ డౌన్ పిరియడ్ లో తాను అనేకసార్లు ‘బాహుబలి’ సినిమాను చూస్తూ కాలం గడుపుతున్న విషయాన్ని వివరించాడు.


అంతేకాదు దర్శకుడు సుకుమార్ సినిమాలను కూడ తాను ఈ లాక్ డౌన్ పిరియడ్ లో వరసపెట్టి చూస్తూ బోర్ అన్నది లేకుండా ఫీల్ అవుతున్నానని మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు తాను రామాయణం భాగవతం అమర్ చిత్ర కథలను తిరిగి చదువుతూ వాటిని లోతుగా విశ్లేషిస్తున్న విషయాన్ని వివరించాడు. ‘సవ్యసాచి’ ని విభిన్నంగా తీయాలని ప్రయత్నించి తాను ఫెయిల్ అయినా నాగచైతన్య తనకు ఎంతగానో సపోర్ట్ చేయడమే కాకుండా ‘కార్తికేయ 2’ తో హిట్ కొడతావు అంటూ చైతూ తనకు ఇచ్చిన ప్రోత్సాహం తాను మరిచిపోలేను అని అంటున్నాడు. 


ప్రస్తుతం తాను తీయబోతున్న ‘కార్తికేయ 2’ కథ గురించి వివరిస్తూ ప్రపంచం శస్త్ర చికిత్య అంటే ఏమిటో తెలియని రోజులలో 2వేల సంవత్సరాల కిందట భారతదేశంలో తొలి శస్త్ర చికిత్సను ఆనాటి ఆయుర్వేద వైద్యులు చేసి ఆనాటి ప్రపంచానికి వైద్య రంగంలో తాము ఎంత ముందు ఉన్నామో తెలియచేసారని అభిప్రాయ పడ్డారు.  అలాంటి జ్ఞాన సంపద మన దేశం దాటి విదేశాలకు వెళ్ళిపోయిన చారిత్రక కథనం చుట్టూ అనేక ఆశ్చర్యకరమైన విషయాలతో ‘కార్తికేయ 2’ ఉంటుంది అన్న లీకులు ఇస్తున్నాడు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: