అలనాటి మహానటి సావిత్రి కి తెలుగు చిత్రం పరిశ్రమలో ఎప్పటికి చెరిగిపోని ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ అనే ఒక పుస్తకంలో  లో చెరిగిపోని  ఎన్నో పేజీలు లిఖించుకున్నది మహానటి  సావిత్రి. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన గొప్ప నటి సావిత్రి. పాత్రకు ప్రాణం పోస్తూ... ఎలాంటి పాత్రలోనైనా జీవించి నటిస్తూ... హీరోలను సైతం తలదన్నే స్టార్డమ్ సంపాదించిన గొప్ప నటి సావిత్రి. అప్పట్లో హీరోల డేట్ల కోసం వేచి చూసే దర్శకనిర్మాతలు... స్టార్ హీరోయిన్ గా  ఉన్న సావిత్రి డేట్ల కోసం మరింతగా వేచి చూసేవారు. 

 

 

 ఆ కాలంలోనే మహిళా సాధికారత సాధించిన గొప్ప మహిళల మూర్తి సావిత్రి. మహిళలు ఎక్కడ తక్కువ కాదు అని నిరూపించిన హీరోయిన్ సావిత్రి. అయితే సావిత్రమ్మ ఎప్పటికీ తెలుగు చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థాయిలో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. నేటి తరం యువ కథానాయకులు అందరికీ ఆదర్శం సావిత్రమ్మ. అయితే సావిత్రమ్మ అంటే  నటనకు ప్రతిరూపం అన్న విషయం తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి జీవించి మరి నటిస్తోంది సావిత్రి. అయితే సావిత్రి అంటే కేవలం నటన మాత్రమే కాదు... అభినయం కూడా ఆమె సొంతం.... 

 

 

 ఓవైపు పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న సావిత్రి తన అందం అభినయంతో కూడా మరెంతో మంది అభిమానులను సంపాదించుకుంది అనే చెప్పాలి. తెలుగుతనం ఉట్టిపడే మహానటి సావిత్రి  అందం అభినయం ముందు ఏ హీరోయిన్ అందమైన సాటి రాదు అనే చెప్పాలి. అలాంటి గొప్ప నటి సావిత్రి నటనతోనే కాదు అభినయంతో కూడా ఎంతోమంది ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి చరిత్రలోకెక్కింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: