సాయి పల్లవి పేరు వినిపించగానే మనకి మొట్టమొదటిగా ఆమె హస్కీ వాయిస్ గుర్తుకొస్తుంది. ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన సాయి పల్లవి కేవలం రెండు మూడు సంవత్సరాల్లోనే దక్షిణ భారతదేశంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అచ్చమైన తెలుగు అమ్మాయి లాగా కనిపించే సాయి పల్లవి ఎక్స్పోజింగ్ చేయడానికి అసలు ఇష్టపడదు. శృంగార భరితమైన సన్నివేశాల్లో కూడా నటించేందుకు ఆమె ససేమిరా అంటుంది. డబ్బు సంపాదించేందుకు ఆమె కేవలం సినిమాల్లో తప్ప ఆమె ఇతర కార్యక్రమాలలో వేడుకలో పాల్గొనేందుకు అసలు ఇష్టపడదు.


డాక్టర్ చదువు పూర్తి చేసిన సాయి పల్లవి ఓ చిన్న మారుమూల గ్రామం నుండి సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. నవరసాలు పండించడంలో అనగా తన మోహంలో అన్ని రకాల హావభావాలు పలకడం ఆమెకు పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. ప్రముఖ నటుడు ధనుష్ నటించిన మారి 2 చిత్రంలోని రౌడీ బేబీ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాచురల్ స్టార్ నాని సరసన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలో కూడా అద్భుతంగా నాట్యం చేసి గొప్ప డాన్సర్ గా పేరు పొందింది.


సో, సాయి పల్లవి ప్రస్తుత తెలుగు తమిళ మలయాళ సినీ పరిశ్రమల స్టార్ హీరోయిన్ లలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా అని నిస్సందేహంగా పిలవచ్చు. అందంతో పాటు సాయి పల్లవి కి తెలివి కూడా ఉందని అనేక సందర్భాలలో రుజువైంది. తాను చెప్పాలనుకున్నది బెరుకు లేకుండా చెప్పడంలో ఆమెకు ఆమే సాటి అని చెప్పుకోవచ్చు. శర్వానంద్ హీరోగా నటించిన పడి పడి లేచే మనసు చిత్రం లో సాయి పల్లవి చాలా అందంగా కనిపించింది. ఏమైపోయావే పాటలో కేవలం తన అందమైన కళ్ళతోనే కోట్ల మంది అభిమానులను ఫిదా చేసేసింది. ఏదేమైనా అందం, అభినయం, ప్రతిభ ఉన్న సాయి పల్లవి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో దూసుకెళ్లడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: