టాలీవుడ్ లో కొంత మంది సంచల నటులు, దర్శకులు, నిర్మాతలు ఉంటారు.  వారు ఏం మాట్లాడిన ప్రతి విషయంలో ఆలోచింపజేసే విధంగా లేదా ఇలా కూడా మాట్లాడాతరా అనే విధంగా ఉంటాయి. ఇక టాలీవుడ్ లో  రాంగోపాల్ వర్మ లాగానే మన బండ్ల గణేష్ సైతం ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదు.. ఎన్నికల వేళ కేసీఆర్ ను తెగ తిట్టి ఇప్పుడు దైవాంస సంభూతుడు అంటూ కొనియాడడం ఆయనకే చెల్లింది. రాజకీయాల్లోకి ప్రవేశించి అనక కాడి వదిలేసి ప్రస్తుతం మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ను దేవుడిగా బండ్ల గణేష్ కొలుస్తాడు. నిన్నటికి నిన్న రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉంటున్న బండ్లగణేష్ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు . ఈ సారి ఆయన ఏపీ ప్రతిపక్షనేత తనయుడు నారా లోకేష్ ను టార్గెట్ చేసారు.  ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా లోకేష్‌పై విరుచుకుపడ్డాడు.

 

'చంద్రబాబు కుమారుడిగా పుట్టడం మీ అదృష్టం. చంద్రబాబు కుమారుడిగా తప్ప మీకు రాజకీయంగా ఏ అర్హతా లేదు.అంటూ వ్యాఖ్యలు చేసారు. "గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ప్రేమతో. రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం. కానీ అది చాలా కష్టమని వదిలేశా. రాజకీయనాయకుడి లక్షణాలు.. దమ్ము, ధైర్యం, ప్రజల్లో నమ్మకం, పోరాడుతాడు అన్న విశ్వాసం కల్పించడం. చంద్రబాబు నాయుడు కుమారుడు గా తప్ప రాజకీయంగా గా మీకు ఏ అర్హత లేదు ఎందుకంటే నాకు తెలిసి మీరు రాజకీయంగా ఫెయిల్యూర్ నాయకుడు.

 

ప్రేమతో మీ బండ్ల గణేష్' అంటూ ట్వీట్ చేసారు ఇలా చిత్ర విచిత్రంగా నారా లోకేష్ పై ద్వజమెత్తారు.  అలాగే సీఎం జగన్ ని తెగ మెచ్చుకున్నాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న నిర్వహించిన మీడియా సమావేశంపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. మీడియా సమావేశాన్ని చూస్తుంటే, స్వయంగా ఇంటికి వచ్చి, అందరితో మాట్లాడినట్టుగా అనిపించిందని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: