ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల జీవితాలను తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ప్ర‌తీ ద‌ర్శ‌కుడు బ‌యోపిక్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రముఖులందరి జీవితాల‌ను తెర‌కెక్కించే బాధ్య‌త తీసుకుంటున్నారు ద‌ర్శ‌కులు. ఇప్పటి దాకా వచ్చిన అన్ని బయోపిక్ లు దాదాపు సక్సెస్ అయినవే. బాలీవుడ్ లో ఇప్పటికే చాలా బయోపిక్ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. క్రికెటర్లు, అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా బయోపిక్స్ ప్రేక్షకులను ఆలరించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో డర్టీ పిక్చర్, ఎమ్మెస్ ధోని, సంజు, దంగల్, మేరీ కామ్, నీర్జా, సూపర్ 30, చపక్, భాగ్ మిల్కా భాగ్, థాకరే లాంటి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.

 

తాజాగా క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్, సైనా నేహ్వాల్ లాంటి క్రీడాకారులు జీవితం ఆధారంగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. 1983లో ప్రపంచ కప్ విజయం నేపథ్యంగా కపిల్ దేవ్ జీవిత కథ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం కానున్నది. ఈ ఏడాది చివర్లో 83 చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా సానియా మిర్జా బయోపిక్ నిర్మాణంపై చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో రావల్పిండి ఎక్స్‌ ప్రెస్ షోయబ్ అక్తర్ బయోపిక్ విషయం తెరపైకి వచ్చింది.

 

ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ మీడియాతో మాట్లాడుతూ.. నా బయోపిక్ తీయాల్సి వస్తే.. సల్మాన్ ఖాన్ ఆ సినిమాలో నటించాలని కోరుకొంటాను. నా జీవిత కథకు ఆయన అయితేనే న్యాయం చేస్తారు. బాలీవుడ్‌ లో ఎవరైనా సినిమా తీస్తే అది సల్మాన్ ఖాన్‌ తోనే తీయాలి అని అన్నారు. సల్మాన్ ఖాన్ అంటే షోయబ్ అఖ్తర్‌కు చెప్పలేనంత ఇష్టం. సల్మాన్ సినిమాలన్నా.. నటన అంటే చెప్పలేనంత ఇష్టం. వీలుచిక్కితే సల్మాన్, షోయబ్ ఇద్దరు కలిసి సమయాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వారిద్దరి మధ్య మంచి స్నేహపూరితమైన రిలేషన్స్ ఇప్పటికి కొనసాగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ ప్రెస్ షోయబ్ అక్తర్ బయోపిక్ లో నటించడానికి సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపిస్తారేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: