మే 20 వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రాబోతుంది. అయితే నిజానికి జూ. ఎన్టీఆర్ బర్త్ డే కోసం ఫాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పెద్ద ఎత్తున వేడుకలు జరపడానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం బాగా హంగామా చేయాలనే ఉద్దేశంతో ఫాన్స్ సిద్ధమవుతున్నారు. ఇక ఖచ్చితంగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా నుండి కొమరం భీమ్ వీడియో కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ ప్రేక్షకుల ముందుకు తీసుక రావడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు. 

 

 

ఇకపోతే డైరెక్టర్ రాజమౌళి సప్రైజ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తీసినట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ సినిమాను రాధాకృష్ణ, కళ్యాణ్ రామ్ నిర్మాతగా వహిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 30 గా సోషల్ మీడియాసినిమా ట్రెండ్ అవుతుంది. త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక సప్రైజ్ ఇవ్వబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే  ఆ సప్రైజ్ ఏమిటా అని పలు వార్తలు కూడా వచ్చాయి.

 


కాకపోతే ఎక్కువ శాతం టైటిల్ రివిల్ చేస్తారు అని అభిమానులు అనుకుంటున్నారు. ఈ విషయానికి సంబంధించిన పి.ఆర్ టీం స్పందించడం జరిగింది. ఇక ఆ విషయం పై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని తెలియజేశారు. ఆ తర్వాత లాక్ డౌన్ పూర్తయి, ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ నిర్ణయించుకుంటాడని, అప్పటి వరకూ ఎవరూ ఎటువంటి ఊహాగానాలు చేయవద్దు అని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ ఫాన్స్ కు కాస్త నిరాశే మిగిలిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: