పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండు చిత్రాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులను పవన్ కళ్యాణ్ అద్భుతంగా చెప్పి తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల మధ్య స్నేహబంధం ఏర్పడిందని మనందరికీ తెలుసు. చివరిగా వారిద్దరి కాంబినేషన్లో అజ్ఞాతవాసి సినిమా తెరకెక్కింది కానీ... ఆ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 


ఈ అట్టర్ ఫ్లాప్ సినిమా వారిద్దరి కాంబినేషన్ పై కాస్త చెడు ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. అజ్ఞాతవాసి సినిమా ని త్రివిక్రం శ్రీనివాస్ కాపీ కొట్టాడనే విమర్శలు కూడా అప్పట్లో హల్ చల్ చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో కలిసి తీసిన మూడవ చిత్రం మర్చిపోలేం అటు వంటి డిజాస్టర్ గా నిలిచి సర్వత్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. సినిమా అన్న తర్వాత విజయ పరాజయాలు ఎదురవడం సర్వ సాధారణం అలాగని సినిమాలు చేయకుండా మానేయడం అనేది పొరపాటే. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కలిసి మరొక చిత్రం తీసేందుకు సిద్ధమవుతున్నారు.


అయితే ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారో లేదో తెలియదు కానీ ఆయన కథ మాత్రం అందిస్తాడని సమాచారం. గోపాల గోపాల డైరెక్టర్ పవర్ స్టార్ తో కలిసి సినిమా తీస్తుండగా ఆ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు కథ అందిస్తున్నారట. పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాకి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాశారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ చూడాలని అభిమానులు బాగా కోరుకుంటున్నారు. మరి ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్న ఈ టాక్ నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజుల పాటు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: