గత రెండు రోజులుగా విజయ్ దేవరకొండ పేరు మారుమోగిపోతుంది. కరోనా క్రైసిస్ కారణంగా మిడిల్ క్లాస్ ఫండ్ ని స్టార్ట్ చేసిన దేవరకొండ గురించి అవాస్తవాలు రాసారన్న నేపథ్యంలో ఒక వీడియోని రిలీజ్ చేసాడు. అంతటితో ఆగకుండా కిల్ ఫేక న్యూస్, కిల్ ఫేక్ వెబ్ సైట్స్ అంటూ ట్రెండ్ చేశాడు. విజయ్ కి మద్దతుగా తెలుగు చలన చిత్రపరిశ్రమ మొత్తం నిలబడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు ప్రతీ ఒక్కరూ విజయ్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

 

 

విజయ్ స్టార్ట్ చేసిన ఈ యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు గానీ ప్రస్తుతానికి సినిమా పెద్దలందరూ ఈ గాసిప్ వైబ్ సైట్ పై కోపంగా ఉన్నారని అర్థం అవుతుంది. అయితే ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ ఒక ఘనతని సాధించాడు. పెళ్ళి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్, అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో యూత్ లో విజయ్ కి బాగా క్రేజ్ పెరిగింది. దేశవ్యాప్తంగా విజయ్ పేరు మారుమోగిపోయింది.

 

 

ఆ క్రేజ్ తోనే హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ స్థానంలో మొదటి స్థానాన్ని సంపాదించాడు. విజయ్ సినిమాలకే కాదు విజయ్ ఆటిట్యూడ్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. స్టేజి మీద అతను మాట్లాడే తీరు చాలా మందిని ఆకర్షిస్తుంది. అందువల్లేనేమో సోషల్ మీడియాలో అతనికి ఫాలోవర్లు రోజు రోజుకీ పెరుగుతున్నారు. విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్ లో ఏడుమిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అది కూడా ఇన్స్టా అకౌంట్ స్టార్ట్ చేసిన రెండు సంవత్సరాల్లో కావడం విశేషం.

 

 

ఇన్స్టాగ్రామ్ ఖాతాద్వారా ఇంతమంది ఫాలోవర్లని ఆకర్షించిన విజయ్ రికార్డు సాధించాడు. దక్షిణాదిలోనే ఏ హీరోకి కూడా ఇంతమంది ఫాలోవర్లు లేరు. విజయ్ ఒక్కడే ఈ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: