తెలుగు ఇండస్ట్రీలో తేజ దర్శకత్వంలో కళ్యాన్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీ కళ్యానం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల కలువుల కళ్ల సుందరి కాజల్.  ఆ తర్వాత ఈ అమ్మడికి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ బ్లాక్ బస్టర్ తర్వాత తెలుగు, తమిళంలో వరుస ఛాన్సులు వచ్చాయి. కాజల్ కెరీర్లో మెగా హీరోలు చిరు, పవన్, బన్నీ, రామ్ చరణ్ సరసన నటించించి మెప్పించింది.  కెరియర్ పరంగా కాజల్ కి గ్యాప్ వచ్చిన ప్రతిసారి, భారీ సినిమాల్లో ఆమెకి అవకాశాలు రావడం .. ఆమె కెరియర్ తిరిగి పుంజుకోవడం జరుగుతూ వస్తోంది.

 

ఆ మధ్య కాజల్ జోరు తగ్గుతుందని అనిపించినప్పుడే ఆమెకి  'ఖైదీ నెంబర్ 150' సినిమాలో అవకాశం దక్కింది. ఆ తరువాత 'భారతీయుడు 2' సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం  ఉదయనిధి స్టాలిన్ మూవీలో నటిస్తుంది.. ఇందుకు గాను భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. సీనియర్, జూనియర్ అనే తేడా లేకండా ఏ హీరోతో అయినా సై అంటుంది. గతంలో మురుగదాస్ దర్శకత్వం విజయ్ హీరోగా నటించిన ‘తుపాకి’ మూవీలో నటించింది. దేశంలో ఉండే స్లీపర్ సెల్స్ నేపథ్యంలో తెరకెక్కించారు ఈ మూవీ. 

 

 

 ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పనిలో ఉన్నారు దర్శకులు. 2012 లో వచ్చిన ఆ సినిమా విజయ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా  నిలిచింది.  గతంలో కాజల్ చేసిన పాత్రకి కొనసాగింపుగా ఆమెనే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానున్నట్టు చెబుతున్నారు.  ఈ మూవీ తెలుగు లో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే సీక్వెల్ తోను ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: