మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రీ ఎంట్రీ త‌ర్వాత ఆయ‌న‌లో కొత్త జోష్ వ‌చ్చింది. ఇప్పుడు చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ఈ క్రమంలో 'లూసిఫర్' అనే మలయాళ మూవీని చిరు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మోహన్ లాల్ - పృథ్వీరాజ్ హీరోలుగా రూపొందిన 'లూసిఫర్' మూవీ మలయాళీ భాషలో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుంచాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ రీమేక్ హక్కులను చేజిక్కించుకున్నారు. ఆయన నిర్మాణంలోనే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ మూవీ రూపొందనుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను 'సాహో' ఫేమ్ సుజీత్‌ కి అప్పగించినట్లు క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్. ఆ తర్వాత మెహర్ రమేష్‌తో పాటు బాబీతో సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించాడు.

 

తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో చిరంజీవి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేయబోతున్నట్టు సమాచారం. శంకర్ మొదటి సినిమా ‘జెంటిల్ మెన్’ సినిమా విడుదలైనప్పటి నుంచి చిరు.. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమానైనా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఇక ఇదే ‘జెంటిల్‌మెన్’ సినిమాను హిందీలో చిరంజీవి..మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో ‘ది జెంటిల్‌మెన్’గా రీమేక్ చేసారు. అప్పటి నుంచి శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడం కోసం మెగాస్టార్ వేచి చూస్తూనే ఉన్నాడు. తాజాగా సమాచారం ప్రకారం శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఒక మెసెజ్ ఓరియండెట్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం శంకర్.. కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు 2’ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా కరోనాతో పాటు అంతకు ముందు సెట్‌లో జరిగిన యాక్సిడెంట్ కారణంగా ప్రస్తుతానికి ఆగిపోయింది. వీళ్లిద్దరు ఆయా ప్రాజెక్టులు పూర్తైయిన తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ఈసినిమాను అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయి. మరి వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కోతున్న ఈసినిమా టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: