కలర్స్ ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ.. మనదరితో చివరకు తన పేరు కూడా కలర్స్ స్వాతి అనే పిలిపించేలా చేసుకుందే. ఈ భామ మన తెలుగు ఇండస్ట్రీకి డేంజర్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత " అష్టా చమ్మా"  మూవీ తో నానితో జతకట్టింది. ఇందులో మహేష్... మహేష్... అన్న డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత " గోల్కొండ హైస్కూల్, మిరపకాయ, కందిరీగ, స్వామి రారా..., బంగారు కోడిపెట్ట, కార్తికేయ, త్రిపుర సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఇటీవల స్వాతి వివాహ బంధంపై కూడా పలు వార్తలు వినపడ్డాయి. ప్రస్తుతం ఆవిడా పెళ్లి చేసుకొని హాయిగా ఉంది. 

 

ఇకపోతే, ప్రస్తుత రోజుల్లో సెలబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలను ఓపెన్ చేసి వాటి ద్వారా నెటిజన్ దృష్టి మార్చడం చాలా సర్వసాధారణం. అంతేకాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజురోజుకీ వందల నకిలీ ఖాతాలు ఓపెన్ అవుతున్నాయి. ఇక ఈ ఖాతాలు పుట్టుక రావడంతో నిజమేదో అబద్ధం ఏదో అభిమానులకు అర్థం అవ్వటం లేదు. ఇక అసలు విషయానికి వస్తే ... కలర్ స్వాతికి సంబంధించిన నకిలీ అకౌంట్ ఒకటి క్రియేట్ అవడంతో ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలపడం జరిగింది. 


ఇక ఈ విషయంపై స్వాతి మాట్లాడుతూ... వారం తర్వాత సోషల్ మీడియాలో కి వచ్చాను. నా పేరు మీది నకిలీ ప్రొఫైల్ చూశాను. నాకు ఎలాంటి అకౌంట్ లేదు. ఫేస్ బుక్ అకౌంట్ 2011 సంవత్సరంలోనే తొలగించారు. ఇక ఇన్ ‌స్టాగ్రామ్‌లో కూడా ఎందుకు ఉన్నానో నాకు తెలియదు. అదికూడా బహుశా ఇలాంటి ఘటనపై క్లారిటీ ఇవ్వడం కోసమే ఉన్నానేమో అంటూ స్వాతి తెలియజేశారు. ఇక ఈ నకిలీ ఖాతా విషయాన్ని నా దృష్టికి తెచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు అంటూ స్వాతి తెలిపింది. ఇక ఆ నకిలీ ఖాతా ఎవరు క్రీయేట్ చేశారో వెంటనే అకౌంట్ ని తొలగించండి అంటూ కలర్స్ స్వాతి కోరడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: