తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులద్దిన దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ.. అదే కమర్షియల్ అంశాలకు, కామెడీ, సెంటిమెంట్ ను జోడించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. అప్పట్లో నాగార్జునకు యువ సామ్రాట్ గా యూత్ ఐకాన్ గా మంచి క్రేజ్ ఉంది. కామెడీ సినిమాలతో ఈవీవీ మంచి డిమాండ్ లో ఉన్నారు. కమర్షియల్ హీరోగా ఉన్న నాగార్జునతో పై అంశాలను జోడించి ఈవీవీ కొట్టిన తొలి బ్లాక్ బస్టర్ ‘వారసుడు’. ఈ సినిమా విడుదలై నేటితో 27ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

యూత్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా 1993 మే6న విడుదలైంది. తొలి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ నటించడం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటికి కృష్ణ ఇంకా హీరోగా సినిమాలు చేస్తున్నారు. కథలో ఉన్న ఇంపార్టెన్స్ దృష్ట్యా ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించారు ఈవీవీ. అనుకున్నట్టే ఈ సినిమాలో మాఫియా డాన్ గా, నాగ్ తండ్రిగా ఆయన పాత్ర బాగా వర్కౌట్ అయింది. సినిమా సక్సెస్ కు కీలకమైంది. నాగ్–కృష్ణ పాత్రలు పోటాపోటీగా ఉండేలా ఈవీవీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. హీరోయిన్ గా నగ్మా అందం సినిమాకు ప్లస్ అయింది.

IHG

 

కీరవాణి స్వరపరచిన అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ప్రతి పాట సూపర్ హిట్టే. ఫస్టాఫ్ లో కాలేజీ సీన్లు, బ్రహ్మానందం కామెడీ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. సెకండాఫ్ లో సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించి నాగ్ ను కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసింది. జయభేరి బ్యానర్ లో కిషోర్ నిర్మాతగా మురళీమోహన్ నిర్మించిన ఈ సినిమా 24 సెంటర్లలో 100 రోజులు, కాకినాడలో 200 రోజులకు పైగా ఆడి నాగ్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: