లేడీ సూపర్ స్టార్ ఆవిషయం బయట చెప్పుకోలేక కుమిలి పోతోందట. ప్రొఫెషనల్ లైఫ్ లో డిస్పూట్ అనేదే లేకుండా హవా సాగిస్తున్న నయనతారకు పర్సనల్ లైఫ్ మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. అమ్మడి తప్పుందో.. అవతలి వారి తప్పుందో కానీ ఎఫెక్ట్ మాత్రం నయన్ మీదే పడుతోంది. ప్రస్తుతం బాధ చెప్పుకోలేని నయన్ పరిస్థితిని చూసి కోలీవుడ్ జనం అయ్యో పాపం అంటున్నారట. 


సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరంటే.. ఠక్కున నయనతార పేరు చెప్పేస్తారు. 15ఏళ్ల కెరీర్ లో ఒడిదుడుకులు అనేదే లేకుండా లేడీ సూపర్ స్టార్ గా హవా సాగిస్తోంది. కెరీర్ పరంగా సూపర్ స్టార్ అయినా వ్యక్తిగత విషయాల్లో మాత్రం పలు వివాదాలను విమర్శలను ఎదుర్కొంటూ వస్తోంది. లవ్ ఎఫైర్స్ విషయంలో నయనతార ఎప్పటికప్పుడు సెంట్రల్ పాయింట్ అవుతోంది. ఎందుకో కానీ నయన్ కు లవ్ అస్సలు కలిసి రావడం లేదు. 


కెరీర్ ఆరంభంలో శింబుతో పీకల్లోతు ప్రేమాయణం సాగింది. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమ నయన్ జీవితాన్ని మరింతగా కుంగదీసింది. ప్రభుదేవా కోసం మతం కూడా మార్చుకుంది. ఇద్దరు కూడా పెళ్లిచేసునకున్నట్టే అనుకుంటున్న టైమ్ లో ఏమైందో ఏమో గానీ ప్రభుదేవా నయన్ పెళ్లి క్యాన్సిల్ అయింది. ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత బాగా డిస్ట్రబ్ అయిన నయనతార కెరీర్ మాత్రం డిస్టర్బ్ కాలేదు.  ఆ తర్వాత నేను రౌడీ సినిమా టైమ్ లో డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమలో పడింది. వీరిద్దరూ చాలా కాలంగా సహజీవనం సాగిస్తున్నారనే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చినట్టు వినిపిస్తోంది. నయన తార సినిమాలతో బిజీగా ఉండటం వల్ల పెళ్లి కోసం కొంత సమయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు లాంగ్ రిలేషన్ షిప్ లో నయన్, విఘ్నేష్ శివన్ మధ్య వివాదాలు మొదలయ్యాయట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: