ఇప్పుడు అవకాశాల కోసం హీరోయిన్ లు పడుతున్న కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్ లు చాలా మంది అవకాశం వస్తే చాలు అనుకుని ఇప్పుడు దర్శక నిర్మాతలు ఏది అడిగినా సరే ఓకే అనేసారు. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ లు మాజీ హీరోయిన్ లు కూడా దాదాపుగా ఓకే చెప్పేశారు. ముఖ్యంగా స్నేహ భూమిక వంటి హీరోయిన్ లు ఇప్పుడు అవకాశాల కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. 

 

ప్రస్తుతం భూమిక తనకు అవకాశం వస్తే ఏ పాత్ర అయినా చేయడానికి నేను రెడీ అని చెప్తోంద‌ట‌. ఆమె అవకాశాల కోసం చాలా ఆశగా ఎదురు చూస్తుంది కూడా. కొద్ది రోజుల క్రితం వ‌చ్చిన బాల‌య్య రూల‌ర్ సినిమాలో ఓ ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లో ఆమె న‌టించింది. అయితే ఆ సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో అస‌లు ఆ సినిమాలో భూమిక ఉన్న విష‌య‌మే చాలా మందికి గుర్తు కూడా లేదు. రూల‌ర్ పాత్ర ఆమె కు ఇప్ప‌ట్లో ఎంత మాత్రం యూజ్ అవ్వ‌లేదు.

 

ఈ తరుణంలో ఒక టాలీవుడ్ యువ దర్శకుడు ఆమెకు న్యూడ్ సినిమా ఆఫర్ ఇచ్చారట. కథ చెప్పి నటనకు ప్రాధాన్యత ఉంటుంది అని వేశ్య పాత్ర అని చెప్పగా తనకు ఏ ఇబ్బంది లేదని చేస్తా అని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కథ రెడీ అవుతుంది.  ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ సినిమా అంతా ఒక ఇంట్లోనే షూటింగ్ జరుపుకుంటుంది అని సమాచారం. 

 

లాక్ డౌన్ లోనే షూటింగ్ ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. నిర్మాత ఒక టాలీవుడ్ సీనియర్ హీరో అని సమాచారం. కథ పూర్తిగా రెడీ అయిన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: