దాదాపు రెండు నెలల క్రితం అధికార పార్టీ ఎమ్మెల్యే తమ్ముడు రితేష్ రెడ్డి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో బీర్ బాటిల్ తో దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత రాహుల్ ఎమ్మెల్యే తమ్ముడిపై, మరికొంతమందిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే ఆ తరువాత ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. 
 
అయితే తాజగా రాహుల్ సిప్లిగంజ్ ఈ కేసు గురించి స్పందించాడు. ఈ కేసుకు ప్రస్తుతం ఇంటర్వెల్ బ్యాంగ్ పడిందని... క్లైమాక్స్ ఇంకా ఉందని చెబుతూ తెరవెనుక ఏం జరిగిందో స్పష్టతనిచ్చాడు. ఆరోజు బాటిల్ తో దాడి చేసిన తరువాత ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వినయ్ భాస్కర్ ద్వారా కలిసి సారీ చెప్పారని... దాడి చేసిన రితేష్ మాత్రం రాలేదని అన్నారు. 
 
రితేష్ కు ముఖం చూపించడానికి సిగ్గేసినట్టు ఉందని.. అతని వల్ల వాళ్ల అన్నకు చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు ఇంటికి వచ్చిన సమయంలో రితేష్ మీడియా ముందుకు వచ్చి సారీ చెబితే కేసు వదిలేస్తానని చెప్పానని... వాళ్లు మేం వచ్చినాం కేసు విత్ డ్రా చేసుకోవాలని కోరారని రాహుల్ చెప్పారు. రాజకీయ నాయకులు అంటే ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే కదా అని రాహుల్ అన్నారు. 
 
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మా ఇంటికి వచ్చిన సమయంలో ఒకడ్ని పట్టుకుని పదమంది దాడి చేశారని... మీకసలు బుద్ధి ఉందా...? అంటూ అమ్మ వాళ్లను అడిగిందని రాహుల్ చెప్పారు. మొదట వాళ్లు తనను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిశారని... ఆ తరువాత ఇంటికి వచ్చి మళ్లీ సారీ చెప్పారని... మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పమని అడిగిన సమయంలో లాక్ డౌన్ ప్రకటించడంతో ఇష్యూకు ఇంటర్వెల్ బ్యాంగ్ పడిందని రాహుల్ చెప్పారు. లాక్ డౌన్ అనంతరం రితేష్ మీడియా ముందుకు వచ్చి సారీ చెబుతాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: