పెళ్లి  చూపులు సినిమాతో హీరోగా మారిన నటుడు విజయ్ దేవరకొండ, ఆ సినిమాతో మంచి హిట్ కొట్టి హీరోగా నటించిన ఫస్ట్ సినిమాతోనే మంచి పేరు దక్కించుకున్నాడు. అంతకముందు రవిబాబు తీసిన నువ్విలా సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన విజయ్, ఆపై వచ్చిన ఎవడే సుభ్రహ్మణ్యం సినిమాలోని తన క్యారెక్టర్ తో ప్రేక్షకుల మదిని గెలుచుకున్నాడు. ఇక పెళ్లి చూపులు అనంతరం విజయ్ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు రెండూ కూడా ఒకదానిని మించి మరొకటి గొప్ప విజయాలు అందుకుని విజయ్ కి ఒక స్టార్ హీరో స్టేటస్ ని తెచ్చిపెట్టడం జరిగింది. 

 

ఇక ఆ తరువాత నుండి వరుసగా అవకాశాలతో దూసుకెళ్లిన విజయ్, ఆ తరువాత నుండి కెరీర్ పరంగా కొంత సక్సెస్ లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఫైటర్'. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి, ఛార్మి కలిసి పూరి టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ల పై ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెలుగు, హిందీ సహా పలు ఇతర భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ అయ్యేలా ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్ మార్షల్ ఆర్ట్స్, కరాటే వంటి పలు యుద్ధ విద్యల్లో ఎంతో కష్టపడి శిక్షణ తీసుకున్నాడు విజయ్. 

 

ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మరొక మూడు రోజుల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మే 9 న విజయ్ పుట్టిన రోజు కావడంతో సినిమా యూనిట్ ఆ రోజున సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నట్లు చెప్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి సినీ ఇండస్ట్రీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, ఇది విజయ్ ఫ్యాన్స్ కి పండుగ వార్తే అని చెప్పాలి.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: