ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నవారిలో పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారు. జోన్లకు అతీతంగా, పరిస్థితులకు వెరవకుండా వారు చేస్తున్న పనికి దేశ ప్రధాని నుంచి సామాన్యుల వరకూ అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల ముందుకొచ్చి వారికి వినూత్న పద్ధతిలో సాయం అందిస్తున్నారు. మండే ఎండల్లో పని చేస్తున్న వారికి మజ్జిగ, బాదం పాలు అందిస్తున్నారు. ఇందుకు శేఖర్ జీహెచ్ ఎంసీ అధికారులతో మాట్లాడి విజయ డైరీ సాయంతో వీటిని అందిస్తున్నారు.

 

 

ఇప్పుడు ఇదే తరహాలో ఏపీలోని కర్నూలు పట్టణంలో కూడా అందిస్తున్నారు. మండే ఎండల్లో పని చేస్తున్నవారికి అక్కడి మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఉదయం 11 గంటల సమయంలో అందేలా ఏర్పాట్లు చేశారు. సాయం అందించేవారు ఇలా అధికారులతో మాట్లాడి సాయం అందించాలని శేఖర్ పిలుపునిస్తున్నారు. ఒక్కరే కాకపోతే ఓ గ్రూప్ గా ఫామ్ అయి మన కోసం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సాయం చేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. శేఖర్ చేస్తున్న చారిటీకి స్పందించిన విజయా డైరీ కూడా ఎమ్మార్పీ ధరను కొంచెం తగ్గించి మజ్జిగ, బాదం పాలను సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది.

 

 

హైదరాబాద్ మహానగరంలో ఎక్కడెక్కడో పని చేస్తున్న వారందరికీ స్వయంగా ఇవ్వడం కుదరని పని. ఇందుకు జీహెచ్ఎంసీ నార్త్ జోన్ అధికారులతో సంప్రదించి నగరంలో పని చేస్తున్న కార్మికులందరికీ వీటిని అందించే ఏర్పాట్లు చేశారు. ఈ పద్ధతి సక్సెస్ కావడంతో కర్నూలు సిటీలో కూడా అమలు చేస్తున్నామని శేఖర్ కమ్ముల తన ఫేస్ బుక్ లో తెలిపారు. శేఖర్ కమ్ముల చేస్తున్న సాయానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. రీసెంట్ గా కూడా శేఖర్ కమ్ముల హైదరాబాద్ లోని హిజ్రాలకు నిత్యావసరాలు అందించారు. శేఖర్ చేస్తున్న సాయం వార్తల్లో నిలుస్తోంది.

Watching sanitation workers toiling it out continuously in the hot summer is really heart breaking. Areas in and around...

Posted by Sekhar Kammula on Monday, 4 May 2020

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: