టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ గా ప్రస్తుతం చెలామణి అవుతున్న హీరోయిన్ సమంత‌. ఆమె ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లు అవుతున్నా ఇప్ప‌ట‌కి సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో తిరుగులేని హీరోయిన్‌గా కంటిన్యూ అవుతోంది. పెళ్లయినా కూడా స‌మంత క్రేజ్ ఇసుమంత కూడా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఆమె సినిమాలు పెద్దగా రాకపోయినా సరే ప్రేక్షకులు  మాత్రం ఆమె సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత౦ సమంతా చేతిలో ఏ సినిమా లేదు. ఆమె వచ్చే ఏడాది వరకు ఏ సినిమా చేసే ఆలోచనలో లేదని సమాచార౦. ప్రస్తుతం ఆమెకు ఆఫర్లు వచ్చినా సరే చేసేది లేదని ఆమె స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది.

 

అయితే ఆమె ఇప్పుడు ఒక కథను స్వయంగా రెడీ చేయించింది అంటున్నారు. ఒక చిన్న సినిమాను 30 నిమిషాలు ఉండే విధంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఆ పాత్ర ఏంటీ అంటే, రుతుక్రమం వచ్చిన మహిళను రేప్ చేసే పాత్ర. ఆ సినిమాలో మహిళ ప్రాణాలతో పోరాడటమే కాకుండా బోల్డ్ గా నటించాల్సి ఉంటుంది. ఆమె అందుకు దాదాపుగా రెడీ అయి భర్త నాగచైతన్య తో కూడా చెప్పింది అని టాక్. అతను కూడా అందుకు ఓకే చెప్పాడని ఆమె ఈ సినిమాను తానే నిర్మాతగా తీసుకొచ్చే ఆలోచనలో ఉంది అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.

 

ఈ సినిమాలో ఒక హాలీవుడ్ నటుడు కూడా ఉంటాడు అని రేపిస్ట్ అతనే అని సమాచారం. అయితే నాగార్జున మాత్రం అందుకు ఒప్పుకోలేదు అని టాక్ వినపడుతుంది. ఈ సమయంలో అలాంటి కథలకు మంచి ఆదరణ ఉన్నా పెళ్లి తర్వాత మంచిది కాదని ఆయన ఆమెకు చెప్పింది అంటున్నారు. మరి సెట్స్ మీదకు వెళ్తుందా ? లేదా అనేది చూడాలి. స‌మంత ఈ ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టిస్తే అది పెద్ద సంచ‌ల‌న‌మే అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: