టాలీవుడ్ లో నటించేందుకు ఇప్పుడు బాలీవుడ్ నటులు ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే దర్శక ధీరుడు రాజ మౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా త్రిపులార్ పై అటు చిత్ర యూనిట్ లోను , ఇటు ప్రేక్షకులలోనూ ఒక విధమైన ఆసక్తి కనపడుతుంది. అతి పెద్ద మల్టి స్టారర్ గా తెర కెక్కుతున్న ఈ సినిమాలో కధ లోని సారాంశం ఏమిటి, ఎన్టిఆర్, రాం చరణ్ లకు జోడిగా ఎవరు నటిస్తున్నారు. ఇలా అన్ని అంశాలపై ప్రేక్షకులకు  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

అయితే ఈ సినిమాలో రాం చరణ్ కి జోడిగా బాలీవుడ్ నుండి వచ్చిన మోస్ట్ టాలెంటెడ్  నటి ఆలియా భట్ ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆలియా భట్సినిమా నుండి తప్పుకున్నారనే వార్తలు సిని పరిశ్రమలో గట్టిగా వినిపిస్తున్నాయి. వీటి పై ఇప్పటికే సదరు నటి వివరణ ఇచ్చినా రూమర్లు మాత్రం ఆగటం లేదు. దీనితో ఆ సినిమా దర్శకుడు రాజ మౌళి తన సోషల్ మీడియా  ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇద్దరి హీరోల మధ్య సమవుజ్జిగా నటించడానికి గాను ఆలియా భట్ ని తీసుకున్నట్టు తెలిపారు.

 

అంతే కాక కథ పరంగా అల్లూరి సీతా రామ రాజు పాత్రలో నటిస్తున్న రాం చరణ్ కు జోడిగా సీత పాత్రకి ఆలియా భట్ ని సెలెక్ట్ చేసినట్టు తెలిపారు. ఈ సినిమాలో సీత పాత్ర అతి కీలకమైనదని ఆ పాత్రకి ఆలియా అయితేనే సరిగ్గా సరిపోతుందని తెలిపారు. సీత పాత్ర విషయానికి వస్తే అమాయకం గా కనపడుతూ, రాబోయే ముప్పుని ముందే పసిగట్టి  దాడికి సిద్దంగా ఉండాలని, అలాగే ఎలాంటి పరిస్థితిలోనైనా మానసిక దృడత్వం కలిగి ఉండాలని అన్నారు. అలాంటి లక్షాణాలన్ని ఆలియా భట్ లో కనిపించాయని ఎమోషనల్ పోస్ట్  చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: