తెలుగు సిని ఇండస్ట్రీ లోకి జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి దిల్, సై వంటి సినిమాలతో నిలదొక్కుకున్న యువ నటుడు నితిన్. ఎటువంటి ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనదైన స్టయిల్ లో తెలుగు ఇండస్ట్రీ లో దూసుకు పోతున్నాడు. తన కెరీర్ లో ఇష్క్, అ ఆ, చల్ మోహన రంగా, శ్రీనివాస కల్యాణం, తాజాగా భీష్మ వంటి చిత్రాలు మైలు రాళ్లు గా నిలిచాయి. వరుస విజయాలతో ఈ యువ హీరో భారీగా అభిమానులను సంపాదించాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ యువ హీరో యు ట్యూబ్ చానెల్ లలో కూడా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. 

 

వివరాల ప్రకారం  దక్షిణాదిలో అగ్ర‌గామి మ్యూజిక్ కంపెనీగా ఆదిత్య మ్యూజిక్ సంస్థ యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఆదిత్య మూవీస్ అకౌంట్‌పే ఓపెన్ చేసి తెలుగు హీరోల, హిందీ డ‌బ్బింగ్ సినిమాలను అప్‌లోడ్ చేస్తూ భారీగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఈ మధ్య ఆదిత్య మూవీస్ ఛానెల్‌లో ప్రసారమైన చిత్రాలకు.. ముఖ్యంగా నితిన్ సినిమాలకు భారీ వ్యూస్ వ‌స్తున్నాయి. తాజాగా హీరో నితిన్ న‌టించిన సూప‌ర్ హిట్ సినిమాలు అఆ, చ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం హిందీ డ‌బ్ వెర్ష‌న్ కు ఓవ‌ర్ ఆల్ గా 400 మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం విశేషం. 

 

నితిన్ కెరీర్ లో వరుసగా విడుదల అయ్యి, సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు అ ఆ, చల్ మోహన రంగ, శ్రీనివాస కల్యాణం. ఈ మూడు సినిమాలకు సంబంధించి హిందీ డబ్బింగ్ రైట్స్ ఆదిత్య మ్యూజిక్ సంస్థకే ఉన్నాయి. దీనికి సంబంధించి  ఆ సంస్థ డైరెక్టర్ లు మాట్లాడుతూ సాధారణం గా యాక్షన్ సినిమాలను ఆదరించే నార్త్ ఇండియన్స్ అ ఆ వంటి కుటుంబ కథా చిత్రాన్ని కూడా ఆదరించడం విశేషం. నితిన్ కెరీర్ లో వచ్చిన దాదాపు 19 సినిమాలు ఆడియో రైట్స్ మా సంస్థ ద్వారా నే రిలీజ్ అయ్యాయని, మా పై నితిన్ గారు ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు, అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: