తెలుగు సినీ ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ఎంతో మంది చాలా ఎదురు చూస్తారు. కాని అది అంత ఈజీగా సాధ్యం అయ్యే పని కాదు. చాలా మంది హీరో, హీరోయిన్ అవ్వాలని వచ్చి అవకాశాలు రాక వెనక్కి తిరుగుతారు. కొంత మంది చిన్న చిన్న పాత్రలతో అడ్జెస్ట్ అవుతారు. లేదా యాంకర్లుగా స్థిరపడతారు. అయితే చాలా మంది అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చి అగ్ర హీరోలలో ఒకరోగా గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. 

 

కలియుగ పాండవులు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వరుస విజయాలను అందుకుని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సురేష్ ప్రొడక్షన్ అధినేత దగ్గుబాటి. రామానాయుడి గారి కుమారుడు వెంకటేష్. అయితే రామానాయుడు గారు వెంకటేష్ ని బిజినెస్ మ్యాన్ చేయాలని యుఎస్ లో ఎంబిఏ చదివించారు. అయితే బిజినెస్ ప్రారంభానికి ముందే సినిమాలో అవకాశo వచ్చింది. అది కూడా సూపర్ స్టార్ కృష్ణ తప్పుకోవడం వల్ల ఆ అవకాశo  వచ్చింది. రామానాయుడు నిర్మించిన కలియుగ పాండవులు సినిమాను కృష్ణ తో చేయాలని అనుకున్నా దానికి సూపర్ స్టార్ పెట్టిన కండిషన్ వల్ల కృష్ణ ని తప్పించారు.

 

 దీనితో హీరో కోసం వెతికే క్రమంలో సన్నిహితుల సలహా తో వెంకటేష్ ని తెలుగు పరిశ్రమకు పరిచయం చేసారు. ఈ సినిమాలో కుష్భు కూడా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనది. ఈ సినిమాకు పరచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించగా, చక్రవర్తి పాటలు అందించారు. ఇక ఆ సినిమా తర్వాత వెంకటేష్ తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో బిజీ అయ్యారు.   గత నాలుగు దశాబ్దాలుగా వెంకటేష్ సిని ప్రస్థానంలో ఎన్నో భారీ విజయాలను అందుకున్నారు. ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. వెంకటేష్ సినిమా అంటే అప్పట్లో చిన్న, పెద్ద అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. వెంకటేష్ తో సినిమా చేయాలని దర్శక, నిర్మాతలు కూడా క్యూ కట్టే వారని సినీ వర్గాల కథనం.

మరింత సమాచారం తెలుసుకోండి: