టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. 2010 లో వచ్చిన ప్రస్థానం, స్నేహగీతం సినిమాలతో పరిచయమయ్యాడు. చేసినవి చిన్న పాత్రలైనా మంచి పేరు వచ్చింది. 2011 లో 'షోర్‌ ఇన్‌ ద సిటీ' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. అంతేకాదు తమిళ సినిమాలలోను వరసగా నటించి మంచి ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి సినిమాలు సందీప్ కిషన్ కి హీరో అన్న ఇమేజ్ వచ్చేలా చేశాయి. 

 

ఆ తర్వాత నుండి సోలో హీరోగా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, జోరు, రా రా కృష్ణయ్య, బీరువా, టైగర్, నక్షత్రం ..ఇలా దాదాపు 25 సినిమాలకి పైగా నటించాడు. దాదాపు సందీప్ కిషన్ నటించిన సినిమాలన్ని మినిమం గ్యారెంటీగా ఆడాయి. అంతేకాదు సందీప్ కిషన్ తెలుగు తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలోను హీరోగా మంచి పేరు దక్కించుకున్నాడు. ఇక నిను వీడని నీడను నేనే, నెక్స్ట్ ఏంటి సినిమాలతో ప్రయోగాలని చేయడం ప్రారంభించాడు. అంతేకాదు నిర్మాతగాను మారి సినిమాలను నిర్మించనున్నాడు.

 

ఇక చిత్ర పరిశ్రమలో ఇద్దరు మేనమామలున్నా కూడా తన కెరీర్ కి వాళ్ళ సహాయం తీసుకోకపోవడం సందీప్ కిషన్ గొప్పతనం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ అయిన ఛోటా కె నాయుడు, శ్యాం కె నాయుడు లాంటి వాళ్ళు ఉన్నా కూడా సినిమాలలో ఎంట్రీ ఇవ్వడానికి గాని, అవకాశలకోసం గాని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి గాని తన మేన మామల పేర్లు వాడుకోలేదు. అందుకే ఇండస్ట్రీలో చాలామందికి సందీప్ కిషన్ అంటే మంచి అభిమానం. ఇక మంచు ఫ్యామిలీకి సందీప్ కిషన్ చాలా సన్నిహితంగా ఉంటాడు. ఇక సినిమాలే కాదు వ్యాపార రంగలోను సందీప్ కిషన్ తన సత్తా చాటుతున్నాడు. సొంతంగా బిజినెస్ పెట్టి రెండు పడవల ప్రయాణం విజయవంతంగా సాగిస్తున్నాడు.    

మరింత సమాచారం తెలుసుకోండి: