మగధీర.. అప్పట్లో ఇప్పట్లో ఎప్పటికి ఓ అద్భుతమే.. అలాంటి సినిమాలు ఎప్పుడు గతంలో రాలేదు.. అసలు అలాంటి సినిమాలు అనేవి ఉంటాయి అనేది కూడా తెలియని ప్రేక్షకులకు ఈ సినిమా చేసి తెలుగు ఇండస్ట్రీలో రికార్డు సాధించాడు రాజమౌళి.. కేవలం అంటే కేవలం ఒక లైన్ పై స్టోరీ ని మొత్తం తీశారు.. అదేనండి.. మన రియల్ స్టార్ శ్రీహరి చెప్తాడు కదా! ''ఓడి పొయిన ని ప్రెమను గెలిపించుకొడానికి చీకటి కడుపును ఛీల్చుకుంటు మళ్ళి పుడుతావురా భైరవా, మళ్ళి పుడుతావురా భైరవా! అని. 

 

సినిమా ఎంత అద్బుతంగా ఉందో ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్స్ కి కూడా మంచి ఫేమ్ వచ్చింది. నిజం చెప్పాలి అంటే.. ఈ సినిమాకు ముందు కాజల్ 8 సినిమాలు చేసింది.. 8 సినిమాలు హిట్ అయ్యాయి.. కానీ ఆమె ఎక్కడ పాపులర్ కాలేదు.. కానీ రాజమౌళి చేతిలో పడింది.. ఒక్క సినిమా అంటే ఒకే ఒక సినిమా చేసింది. 

 

ఆ సినిమాలో కాజల్ బొమ్మ లా ఉంది అంటే నమ్మండి... ఎంతో అద్బుతంగా నటించింది. సినిమానే ఓ మ్యాజిక్ అనుకుంటుంటే.. ఆ సినిమా మిత్ర పాత్రలో నటించిన కాజల్ ఇంకా ఓ మ్యాజిక్. ఇందు పాత్రలో ఇంకా సూపరు.. ఆ సినిమాలో హీరో హీరోయిన్ కనెక్షన్.. పంచదార బొమ్మ బొమ్మ సాంగ్ లో ఈమె డ్రెసింగ్ స్టైల్ అప్పట్లో ట్రెండ్ సృష్టించింది. 

 

ఇంకా ఆ తర్వాత 400 ఏళ్ళ క్రితం వెళ్తే.. కాజల్ ఒక మహారాణి.. రామ్ చరణ్ ఏమో ఒక సైనికుడు.. వీరి ఇద్దరి మధ్య పుట్టే ప్రేమ.. సడెన్ ట్విస్ట్ అన్ని అద్భుతమే.. ఇలా ఎన్నో అద్భుతాల మధ్య ఓ మంచి సినిమా రూపొందించారు.. ఇంకా ఈ సినిమాతోనే కాజల్ బాగా ఫేమస్ అయ్యింది. ఏమైతేనేం.. 8 సినిమాలు హిట్ అయినా పెద్దగా ఎవరికీ తెలియని ఈ హీరోయిన్ మగధీరతో అందరి మనసులు దోచుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: