నివేద థామస్.. ఒక్క సినిమా చాలు.. ఒకే ఒక సినిమా సూపర్ హిట్ అంతే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన నివేద థామస్ టాలీవుడ్ లో ఫస్ట్ సినిమాతోనే ఫేమస్ అయిపోయింది.. క్యూట్ గా కనిపిస్తూ.. ఎంతో అద్భుతంగా నటించేసింది నివేద థామస్. ఇంకా జెంటిల్ మ్యాన్ సినిమాలో నానితో పోటీ పడి మరి నటించింది నివేద.         

 

ఇంకా ఈ సినిమాలో నాని.. నివేద థామస్ ఆన్ స్క్రీన్ సూపర్ గా ఉన్నారు.. ఇంకా వాళ్ళ రొమాన్స్.. ఎన్నో అద్భుతాలు జరిగాయి.. ఇంకా నివేద థామస్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.. ఆ తర్వాత మళ్లీ కూడా నానితోనే జతకట్టి ఓ సినిమా చేసింది.. అదే నిన్ను కోరి.. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అంటే నమ్మండి..           

 

జెంటిల్ మ్యాన్, నిన్ను కోరి తర్వాత ఏకంగా ఎన్టీఆర్ తో కలిసి నటించింది.. ఇంకా ఈ మధ్యే బ్రోచేవారెవరు రా అనే సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.. టాలీవుడ్ లో మంచి నటులలో ఒకరు అని నిరూపించుకుంది.. సినిమాలో హీరోయిన్ అంటే కేవలం డ్యాన్స్ కామెడీ మాత్రమే కాకుండా ఓ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది..

 

పాత్రలో నటించడం కాదు.. నాకు జీవించడమే తెలుసు అని అంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ సరసన కూడా నటించనుంది అని.. అదే అండి పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప'లో కూడా నటించనుంది అని టాక్.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటించింది అంటే ఖచ్చితంగా సూపర్ హిట్ ఏ..                          

మరింత సమాచారం తెలుసుకోండి: