హ.. హ.. హాసిని ఈ పేరు వినగానే మన ముఖంలో చిరునవ్వు రావడం ఖాయం. బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా చేసిన ఈ పాత్ర ఎప్పటికి గుర్తుంటుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో హాసిని పాత్రలో నటించిన జెనీలియా ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. సిద్ధార్థ్, జెనీలియా జోడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బొమ్మరిల్లు భాస్కర్ మొదటి సినిమానే అయినా హీరో, హీరోయిన్ పాత్రలను చాలా కొత్తగా రాసుకున్నాడు. 


ఇక హాసిని పాత్రలో జెనీలియా నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసింది. హ.. హ.. హాసినిగా ఆమె నటన ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సత్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా జెనీలియా ఆ తర్వాత ఎన్టీఆర్ సాంబ సినిమా చేశాడు. ఆ తర్వాత నా అల్లుడులో కూడా ఎన్టీఆర్ తో జతకట్టారు. జెనీలియా చేసిన హ్యాపీ సినిమా కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాను కరుణాకరన్ డైరెక్ట్ చేశారు.

 

ఈ సినిమాలో ఆమె చాలా సైలెంట్ గా.. తన ఎమోషన్స్ అన్ని దాచుకునే పాత్రలో నటించింది. అయితే ఆ తర్వాత ఆమెని హాసినిగా చూపించడంతో ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. బొమ్మరిల్లు సినిమా సక్సెస్ లో జెనీలియా కూడా ఒక ముఖ్య పాత్ర పోషించిందని చెప్పడంలో సందేహం లేదు. బొమ్మరిల్లు సినిమాను దిల్ రాజు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఆ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో జెనీలియాకు సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా బొమ్మరిల్లు. హాసిని అనగానే జెనీలియా గుర్తొచ్చేలా అమ్మడు తన నటనతో మెప్పించింది.         

మరింత సమాచారం తెలుసుకోండి: