సమంతా.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోయిన్ ఈమె. వరుస అవకాశాలు వచ్చినా రాకపోయినా సరే ఆమె కెరీర్ లో మాత్రం దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేసింది. దాదాపు అందరు హీరోలతో ఆమె హిట్స్ కొట్టింది. ఈ తరం యువ హీరోలు అందరికి ఆమెకు లక్కీ హీరోయిన్ అని కూడా టాలీవుడ్ వర్గాలు అంటూ ఉంటాయి. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు రావడం లేదు అని ఆమె పని అయిపోయింది అని చెప్పినా ఆమె మాత్రం సినిమాల పరంగా డిమాండ్ ఉన్న హీరోయిన్ అనేది కొందరి మాట. 

 

ఆమె ప్రస్తుతం ఒక్క మంచి అవకాశం ఎదురు చూస్తుంది. ఇది పక్కన పెడితే ఆమె కెరీర్ లో బ్రేక్ ఇచ్చిన సినిమా బృందావనం. ఎన్టీఆర్ పక్కన ఆమె చేసిన యాక్షన్... ఆమె అందాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాయి అనేది వాస్తవం. ఆమె నటనకు అక్కడి నుంచే మంచి మార్కులు కూడా పడ్డాయి. ఆమె చేస్తున్న సినిమాలకు అక్కడి నుంచి తమిళంలో కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఆమె నటించిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అగ్ర హీరోలు కూడా అప్పటి నుంచి ఆమె మీద దృష్టి పెట్టారు. 

 

ఒక్క ప్రభాస్ తో మినహా ఆమె అందరి హీరోలతో మంచి మంచి హిట్స్ కొట్టింది అనేది వాస్తవం. ఇక ఆ సినిమా తర్వాత అగ్ర దర్శకులు ఆమె పాత్రల మీద కూడా దృష్టి పెట్టారు అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆమె పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసే ఆలోచనలో ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. భర్త తో కలిసి వీటిని ఆమె ప్లాన్ చేస్తుంది అని టాలీవుడ్ వర్గాల సమాచారం. జాను సినిమా ఆమెకు షాక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: