లాక్ డౌన్ సమయాన్ని ఈ నెలాఖరి వరకు పొడిగించే నిర్ణయం తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం విద్యార్ధుల పరీక్షల గురించి ఇంకా అనేక విషయాల పై నిర్ణయాలను ప్రకటించింది కానీ సినిమా షూటింగ్ ల గురించి ఒక్క మాట కూడ మాట్లాడకపోవడంతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఆలోచనలలో పడిపోయింది. కనీసం జూన్ నెల నుంచి అయినా షూటింగ్ లు మొదలవుతాయి అన్న ఇండస్ట్రీ వర్గాల ఆశ ప్రస్తుతానికి నీరుకారిపోయింది. 


ఇలాంటి పరిస్థితులలో టాప్ హీరోలకు సంబంధించి ఒక్క మహేష్ అల్లు అర్జున్ లు తప్ప అందరు కరోనా బాధ్యుతులే అని ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. జూనియర్ రామ్ చరణ్ ల ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రభాస్ జిల్ రాథా కృష్ణుల మూవీ చిరంజీవి ‘ఆచార్య’ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ లతో పాటు రవితేజ ‘క్రాక్’ వెంకటేష్ ‘నారప్ప’ రామ్ ‘రెడ్’ నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమాలతో పాటు ఇంకా నిర్మాణం చివరిలో ఉన్న అఖిల్ శర్వానంద్ ల సినిమాలతో పాటు ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉన్న నాని ‘వి’ అనుష్క ‘నిశ్శబ్దం’ తో పాటు మరెన్నో సినిమాలు కొన్ని షూటింగ్ కోసం మరికొన్ని విడుదల కోసం రెడీగా ఉన్న పరిస్థితులలో ఈ సినిమాల నిర్మాతలు ఇప్పటివరకు పెట్టుబడి పెట్టిన 600 కోట్ల భారీ పెట్టుబడి ఎప్పటికి రికవరీ అవుతుంది అన్నవిషయం అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్న పరిస్థితులలో ఒక్క మహేష్ అల్లు అర్జున్ లు తప్ప ఎవరి స్థాయిలలో వాళ్ళు టెన్షన్ లో ఉన్నారు. 

 

సంక్రాంతి వార్ కు నువ్వా నేనా అంటూ తలపడి ఒకరి పై ఒకరు పై చేయి సాధించాలని చేసిన ప్రయత్నాలలో అల్లు అర్జున్ సుకుమార్ ల ‘పుష్ప’ మహేష్ పరుశు రామ్మూవీ కథలు ఫైనల్ అవ్వడంలో ఆలస్యం జరగడంతో ఈ రెండి సినిమాల్ పై ఈ మూనీ నిర్మాతలకు ఒక్క రూపాయి కూడ ఈ మూవీల షూటింగ్ పై ఖర్చు చేయకుండానే కరోనా సందడి మొదలు కావడంతో ఈ మూవీల షూటింగ్ లు ప్రారంభం కాకుండానే వాయిదా పడ్డాయి. దీనితో ఇండస్ట్రీలోకి వర్కర్స్ దగ్గర నుండి టాప్ సెలెబ్రెటీల వరకు ఎవరి స్థాయిలో వారు కష్టాలు పడుతుంటే గట్టున కూర్చుని మహేష్ బన్నీలు ఎటువంటి సమస్యలు లేకుండా లాక్ డౌన్ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ వస్తున్న కామెంట్స్ విన్నవారికి దురదృష్టం కూడా అదృష్టంగానే మారుతుంది అన్న సామెత గుర్తుకు వస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: