ఇప్పటి వరకు ప్రపంచం కాలగమనాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు తరువాత అంటూ గత రెండువేల సంవత్సరాలుగా కాలానికి లెక్కలు కడుతూ వస్తోంది. అయితే ప్రపంచం పై కరోనా మహమ్మారి మూకమ్మడి దాడితో ఇప్పుడు ప్రపంచదేశాలు అన్నీ తమ కాలాన్ని అదేవిధంగా తమ భవిష్యత్ ను కరోనా ముందు కరోనా తరువాత అనే విధంగా విభజించుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 


ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో పాటు భారత ఆర్ధక వ్యవస్థ కూడ కరోనా దాడితో అతలాకుతలం అవుతున్న పరిస్థితులలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ భవిష్యత్ కూడ ప్రశ్నార్ధకంగా మారింది. అన్ని రంగాలకు సంబంధించి భవిష్యత్ ఆశాజనకంగా లేకపోవడంతో అందరు ఖర్చులు తగ్గించుకుంటున్న పరిస్థితులలో రాబోయే రోజులలో సినిమా నిర్మాణంలో అదేవిధంగా సినిమా పై పెట్టె ఖర్చులో చాల మార్పులు రాబోతున్నాయి. 


ఈ తరుణంలో సినిమాలు తమ బడ్జెట్లు తగ్గించుకోలేకపోతే రాబోయే రోజులలో వాటి మనుగడ కష్టం అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీనితో సినిమా ఖర్చులకు సంబంధించి నియంత్రణ పాటించే విషయంలో హీరోలు డైరెక్టర్లు ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంక్షోభంలో తమవంతు సహాయం చేస్తామని టాప్ హీరోలు అందరు చెపుతున్నా ఏమేరకు సహాయం చేయగలరో ఓపెన్ గా చెప్పడం లేదు. అయితే నిర్మాతలను కాపాడటానికి బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ముందుగా ముందడుగు వేశాడు. తన రాబోయే మూడు చిత్రాలకు తన రెమ్యూనరేషన్ లో 25% తగ్గించుకుంటున్నటు ప్రకటించాడు. ఈ మూడు చిత్రాలూ వివిధ దశల్లో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. 


విజయ్ ఆంటోనీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అనుసరించ వలసిన పరిస్థితి ఇప్పుడు కోలీవుడ్ టాప్ హీరోలకు ఏర్పడింది. వారంతా విజయ్ నిర్ణయాన్ని ఫాలో అయితే ఆ పద్ధతిని అనుసరించమని మన టాప్ హీరోల పై కూడ ఒత్తిడి పెరిగే ఆస్కారం ఉంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాతలు సురేశ్ బాబు దిల్ రాజ్ లు హీరోలు దర్శకులు తమ పారితోషికాలు తగ్గించుకోకుండా సినిమాలు తీయడం కష్టం అని ఓపెన్ గా చెపుతున్న పరిస్థితులలో ఒక విధంగా విజయ్ ఆంటోనీ తన స్పీడ్ తో మన టాప్ హీరోలను వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టాడు అనుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: