టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వయసు మీద పడుతున్నా సరే ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ అనుష్క. ఆమె కెరీర్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ఇలా దాదాపు అందరు హీరోలతో ఆమె నటించింది. ఆమె సినిమాలకు కొన్ని సినిమాల తర్వాత మంచి క్రేజ్ వచ్చింది. ఆమె కెరీర్ లో అరుంధతి సినిమా ఒక ప్లస్ అయితే బాహుబలి సినిమా కూడా ఒక రేంజ్ లో ఆమెను నిలబెట్టింది అనేది వాస్తవం. 

 

ఆమె ఆ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుల దృష్టి లో కూడా పడ్డారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమెకు టాలీవుడ్ లో అక్కడి నుంచి అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం తెలుగుకే పరిమితం అయింది అనే విషయం తెలిసిందే. అరుంధతి సినిమా తర్వాత ఆమె స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. బాహుబలి సినిమా మాత్రం ఆమె కెరీర్ లో ది బెస్ట్ గా నిలబడింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బాహుబలి సినిమాలో ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి అనేది వాస్తవం. 

 

ఆ సినిమాలో ఆమె హావభావాలు, అలాగే రాజమౌళి ఏ విధంగా చెప్పినా సరే ఆ విధంగా నటించి ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది అనుష్క. అనుష్క  నటించిన అరుంధతి సినిమాకు బాలీవుడ్ లో ఫాన్స్ రాలేదు గాని ఈ సినిమా తర్వాత మాత్రం ఆమెకు బాలీవుడ్ లో కూడా ఫాలోయింగ్ పెరిగింది అనేది వాస్తవం. ఆ విధంగా ఆమె స్టార్ హీరోయిన్  హోదాను నిలబెట్టుకుని సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది గాని ఏ సినిమా అనేది స్పష్టం గా తెలియదు. ఆమె వచ్చే ఏడాది సినిమాల నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: