ఇప్పటికే కరోనా వైరస్ అనే మహమ్మారి తో పోరాడుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న విశాఖ వాసులకు మరో ప్రమాదం కబళించింది. విశాఖపట్నం లోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో తెల్లవారుజామున ఒక్కసారిగా విషవాయువు లీక్ అవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గాఢమైన ఈ విష వాయువు ఒక్కసారిగా భారీ మొత్తంలో ఏకంగా మూడు కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందడంతో... ఆ మూడు కిలోమీటర్ల మేర పరిధిలో ఉన్న ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ విష వాయువులు పీల్చుకకోవటంతో  ఎక్కడికక్కడ కోల్పోతూ అచేతన  స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు. 

 

 ఇక ఈ రసాయన వాయువు పీల్చుకోవడం కారణంగా స్పృహ కోల్పోవడం కాదు రసాయన వాయువుతో దద్దుర్లు రావడం తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడం, కడుపులో వికారం లాంటి సమస్యలు రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు స్థానికులు. మరి కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది రోడ్లపైనే అచేతన స్థితిలో పడిపోతున్నారు. ఇక ఇళ్లల్లో నిద్రలో ఉన్న ప్రజలు వెంటనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీస్తున్నారు. 

 

 

 ఇక ఈ ప్రమాదంలో అనారోగ్యానికి గురైన ప్రజలను కూడా హుటాహుటీన విశాఖ కేజీహెచ్కు తరలించారు. అయితే ఈ విష వాయువు కారణంగా ఇప్పటికే కొంత మంది ప్రజలు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ విషవాయువు లీక్ సమస్యను సరి  చేయడానికి రెండు గంటల సమయం పడుతుందని... ప్రజలు వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లాలి అంటూ సూచిస్తున్నారు అధికారులు. దీంతో ప్రజలు విష వాయువు ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. అయితే ఎల్జీ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ నుంచి లీకైన ఈ విష వాయువు కారణంగా ఏకంగా ప్రజల ప్రాణాల మీదికి వచ్చింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: