పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసినప్పటి నుండి ఆయన అభిమానుల సండడి మామూలుగా లేదు. అయితే పవన్ లాంటి మాస్ హీరో ఎలాంటి కథతో ప్రేక్షకులని పలకరిస్తాడీ అని ఎదురుచూస్తున్న టైమ్ లో బాలీవుడ్ పింక్ సినిమాని రీమేక్ చేస్తున్నాడని తెలియడంతో అభిమానులు షాక్ అయ్యారు. పింక్ సినిమాలో మాస్ హీరోకి తగిన అంశాలేమీ ఉండవు. అసలు ఈ సినిమా కథాంశం కూడా హీరోది కాదు.

 

 


మరి అలాంటి సినిమాని పవన్ ఎందుకు చేస్తున్నాడా అన్న అనుమానం కలిగింది. కానీ పింక్ సినిమాలో కథాంశాన్ని మాత్రమే తీసుకుని, పవన్ అభిమానులకి కావాల్సిన అన్నీ మూమెంట్స్ ని అందులో యాడ్ చేశారట. అందువల్ల పవన్ అభిమానులు ఆ విషయంలో ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

 


అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా, తన పాటలని ఇతరదేశాల్లో సైతం పాడుకునేలా చేసిన థమన్, ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే రిలీజైన మగువా... మగువా.. అనే పాటకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

 

 


అంతే కాదు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా వచ్చిందట. పవన్ ఎలివేషన్ సీన్స్ లో వచ్చే నేపథ్య సంగీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందట. సగటు పవన్ కళ్యాణ్ అభిమాని ఏమేమీ కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయని చెబుతున్నాడు. ఒక పాటతో సినిమాపై హైప్ పెంచేసిన థమన్, ఇప్పుడు మాటలతో మరింతగా పెంచేశాడు.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: