పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈయనకు అభిమానులు కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పక్క రాష్ట్రాల్లో కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమానులు ఆయనకు సొంతం. అంతమంది ఎందుకు అంటే ఆయన తీసిన స్టార్టింగ్ ఏడు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. 

 

పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమా అయితే బాగుంది కానీ అంత పెద్ద హిట్ కాలేదు.. కానీ ఓకే అనిపించుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ , తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయ్యాయి.. ఇన్ని సినిమాలు హిట్ అయితే ఏ హీరోకి అయినా సరే ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది.. 

 

ఇంకా ఆ క్రేజ్ తోనే ముందు అడుగు వేసి ఓ సినిమా తీశాడు పవన్ కళ్యాణ్. అదే జానీ.. ఆ సినిమా మొదలు వరుసగా పదేళ్లు పాపం.. అన్ని ప్లాప్ లే. గుడుంబా శంకర్.. బాలు, బంగారం, అన్నవరం, కొమరం పులి.. జల్సా హిట్ లెండి.. ఇంకా ఆతర్వాత వచ్చిన తీన్మార్ సినిమా వామ్మో.. జండూ బాంబ్ సినిమా ఇది. 

 

పంజా ప్లాప్ ఏ.. గబ్బసింగ్ సూపర్ డూపర్ హిట్.. కెమెరా మ్యాన్ గంగతో ప్లాప్.. అత్తారింటికి దారేది సూపర్ హిట్.. సర్దార్ గబ్బర్ సింగ్ అట్టర్ ప్లాప్, గోపాల గోపాల మల్టీస్టార్.. సినిమా ఒకే. కటమారాయుడు అట్టర్ ప్లాప్.. అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్. ఇవి అంది పవన్ కళ్యాణ్ సినిమాలు .. సక్సెస్ కంటే ప్లాప్ లే ఎక్కువ ఉన్నాయ్.. అయినా సరే పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఎక్కువ.     

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: