'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కాస్త గ్యాప్ తీసుకుని తీస్తున్న సినిమా 'పుష్ప'. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక హీరో హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'పుష్ప' పోస్టర్ చూస్తే లెక్కల మాస్టర్ సుకుమార్ మరో ప్రయోగానికి తెరలేపాడని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమైపోతుంది. రాయలసీమ చిత్తూరు యాస, భాషతో పాటు బన్నీ ఊరమాసు మొరటు కుర్రాడిగా ఇరగదీస్తాడనిపిస్తుంది. దీని కోసం అల్లు అర్జున్ ఇప్పటికే శిక్షణ కూడా పొందుతున్నాడు. అంతేకాకుండా సుకుమార్-రామ్ చరణ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' ఛాయలు కూడా 'పుష్ప'లో కనిపిస్తున్నాయి. ఆలాగే బన్నీ డ్రెస్సింగ్ స్టైల్ - గెటప్ కూడా రంగస్థలంలో రామ్ చరణ్ ని పోలివుంది.

 

శేషాచ‌లం అడ‌వుల్లో గంధపు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ పాత్ర కోసం బన్నీ డీ గ్లామర్ లుక్ ట్రై చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ పాత్ర కోసం బన్నీ జుట్టు, గుబురు గడ్డం విపరీతంగా పెంచారు. 'అల వైకుంఠంపురంలో' షూటింగ్ పూర్తి అయిన నాటి నుండి అల్లు అర్జున్ జుట్టు పెంచడం జరిగింది. వెంటనే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనవలసిన నేపథ్యంలో బన్నీ ఇలా జట్టు పెంచేశారు. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అలాగే మరో నెల రోజుల వరకు షూటింగ్ తిరిగి మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. పుష్ప కోసం బన్నీ లుక్ కూడా అవసరానికి మించిపోతుంది. దీనితో ఆయన కష్టపడి సాధించిన మేకోవర్ వేస్ట్ అయిపోతుంది. 'పుష్ప' కోసం బన్నీ పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా అయిందని అందరూ అనుకుంటు.. న్నారు. పాత్ర కోసం ఎలాగైనా మారే బన్నీ మేకోవర్ కోసం మళ్ళీ కేర్ తీసుకోవాలి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. లాక్ ఎత్తేసి షూటింగ్స్ స్టార్ట్ అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: