చిరంజీవి పవన్ కళ్యాణ్ ల దారులు వేరైనా గమ్యం ఒక్కటే. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి అనేక సార్లు ఓపెన్ గా చెప్పాడు. ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి అవ్వాలని ఆశపడి భంగపడ్డ పవన్ కోరికను పరోక్షంగా చిరంజీవి తీర్చడానికి సహకరిస్తున్నాడా అన్నసందేహాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వస్తున్నాయి. 


‘ఆచార్య’ మూవీ ఇంకా పూర్తి కాకుండానే చిరంజీవి సుజిత్ దర్శకత్వంలో నటించబోయే ‘లూసీఫర్’ రీ మెక్ కు లైన్ క్లియర్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ స్క్రిప్ట్ ను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా సుజిత్ మార్పులు చేర్పులు చేస్తున్న పరిస్థితులలో సుజిత్ కు వచ్చిన ఒక ఆలోచనకు చిరంజీవి ప్రోత్సాహం లభిస్తోంది అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. 


తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ ‘లూసీఫర్’ రీమేక్ లో ఒక అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు అని టాక్. ఈ పాత్ర నిడివి ఈ మూవీలో 15 నిముషాలు ఉంటుంది అని అంటున్నారు. ‘లూసీఫర్’ మూవీలో ముఖ్యమంత్రి అయిన సచిన్ కేడ్కర్ మరణించిన తర్వాత అతడి వారసుడిగా టోవినో థామస్ అనే హీరో ఎంట్రీ ఇస్తాడు. అప్పటి వరకు రాజకీయాలు తెలియని అతడికి మోహన్‌ లాల్ ట్రైనింగ్ ఇచ్చి సీమ్ కుర్చీలో కూర్చునేలా చేస్తాడు. 


ఇప్పుడు తెలుగు రీమేక్‌లో ఆ పాత్రను పవన్‌ తో చేయిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన దర్శకుడు సుజిత్ కు రావడంతో సుజిత్ చెప్పిన అభిప్రాయం చిరంజీవికి కూడ బాగా నచ్చింది అని అంటున్నారు. వాస్తవానికి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న చిరంజీవి ఎప్పటికైనా తన కలలను పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ద్వారా తీరుస్తాడు అన్న ఆశలతో ఉంటున్నాడు. దీనితో సుజిత్ చెప్పిన సూచనను ‘లూసీఫర్’ రీమేక్ లో అమలు చేస్తే ఎప్పటికైనా తన రాజకీయ వారసుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అన్న సంకేతాలను మెగా అభిమానులకు ఇచ్చినట్లు అవుతుందనీ చిరంజీవి ఆలోచన. అయితే ఈ ఆలోచనకు పవన్ కళ్యాణ్ నుండి ఎటువంటి స్పందన వస్తుంది అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: