ఇప్పటివరకు పరాజయం అన్నపదం తన కాంపౌండ్ దరి చేరనీయకుండా సినిమాలు తీస్తున్న రాజమౌళి బయట ఎప్పుడు అందరితో నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు. దీనితో జక్కన్నకు అసలు కోపం వస్తుందా అనే సందేహాలు చాలామందికి కలుగుతు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ లాక్ డౌన్ పిరియడ్ లో తనకు జ్ఞానోదయం కలిగించిన ఒక వ్యక్తి గురించి రాజమౌళి ఓపెన్ గా చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. 


రాజమౌళి టీమ్ లో అత్యంత కీలకంగా వ్యవహరించే వ్యక్తులు ఇద్దరు. ఒకరు సంగీత దర్శకుడు కీరవాణి అయితే మరొకరు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ అన్న విషయం ఓపెన్ సీక్రెట్. వీరిద్దరూ తమతమ విభాగాలలో కనపరిచే అద్భుతమైన ప్రావీణ్యం రాజమౌళి సినిమాలను మరింత హైలెట్ చేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో సెంథిల్ తనలో ఉన్న ఒక నెగిటివ్ లక్షణాన్ని ఏవిధంగా తొలగించాడో రాజమౌళి బయటపెట్టాడు.


పది సంవత్సరాల క్రితం వరకు రాజమౌళికి విపరీతంగా కోపం వచ్చేదట. సినిమా షూటింగ్ స్పాట్ లోకి ఎంటర్ అవ్వగానే ఆ షూటింగ్ స్పాట్ లో ఏచిన్న తేడా వచ్చినా అందరి పై విపరీతంగా అసహనం వ్యక్తపరుస్తూ తన కోపాన్ని ప్రదర్శించే వాడట. దీనితో అప్పట్లో యూనిట్ సభ్యులు రాజమౌళితో సినిమాలో తీయబోయే సీన్ విషయమై మాట్లాడటానికే భయపడిపోయేవారట. 


ఈ విషయం గ్రహించిన సెంథిల్ ఒక సందర్భంలో రాజమౌళికి పరోక్షంగా క్లాస్ పీకుతూ యూనిట్ అంతా మన కంట్రోల్ లో ఉండాలి అంటే ఎప్పుడు కోపంగా ఉండకూడదు అనీ అలా ఎప్పుడు కోపంగా ఉంటే యూనిట్ సభ్యులు ఆ కోపానికి అలవాటుపడిపోయి భయపడరనీ పరోక్షంగా తెలియ చేసాడట. అంతేకాదు ఎంతకోపం ఉన్నా ఆకోపాన్ని బయటపెట్టకుండా బయటకు నవ్వుతూ ఉండేవాడే సక్సస్ అందుకుంటాడు అంటూ సెంథిల్ తనతో చనువుగా చెప్పిన ఆమాటలు తన పై ప్రభావం చూపెట్టడంతో అప్పటి నుండి తాను ఎప్పుడు నవ్వుతు తన కోపాన్ని పూర్తిగా తగ్గించుకున్నాను అంటూ రాజమౌళి తన సక్సస్ సీక్రెట్ బయటపెట్టాడు..      

 

మరింత సమాచారం తెలుసుకోండి: