దర్శకులని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటుంటారు. సినిమాని ఎలా తెరకెక్కించాలన్న దాన్నుండి మొదలుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో సినిమా పూర్తయ్యి మొదటి కాపీ వచ్చేంత వరకూ డైరెక్టర్ విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. నటీనటులు నటించగానే వెళ్ళిపోతారు. మ్యూజిక్ అందించగానే సంగీత దర్శకుడి పనైపోతుంది. షూటింగ్ ఉన్నన్ని రోజులే కెమెరామెన్ కి వర్క్ ఎక్కువగా ఉంటుంది.

 


ఇలా ౨౪ విభాగాల్లో ఒక్కొక్కరు ఒక్కో పనిచేసుకుంతూ వెళ్లిపోతారు. కానీ దర్శకుడు మాత్రం ఈ ౨౪విభాగాల్లో పనిచేసే వారందరి నుండి తనక్కావాల్సిన ఔట్ ఫుట్ ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే డైరెక్టర్లకి చాలా ఓపిక కావాలి. ఇష్టం ఉన్నట్టు కోప్పడితే పనులు ఆలస్యం అవడమే కాకుండా క్రియేటివిటీ కూడా మిస్ అవుతుంది. దర్శకధీరుడు రాజమౌళికి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు.

 

 

చేసిన ప్రతీ చిత్రం హిట్ అవుతూనే ఉంది. ఒకదాన్ని మింది మరొకటి బ్లాక్ బస్టర్ బాట పడుతుంది. రాజమౌళి ఎప్పుడు కూడా కోప్పడినట్టు కనిపించడు. ఎక్కడ మాట్లాడినా చాలా చక్కగా, ఎంతో లౌక్యంగా సమాధానాలు ఇస్తుంటారు. అయితే డైరెక్టర్ గా రాజమౌళికి కూడా చాలా కోపం వచ్చేదట. నటీనటులు సరిగ్గా చేయకపోతేనే, మరే కారణంగానో సెట్లో చిరాకు పడేవాడట. ఇది గమనించిన కెమెరామెన్ సెంధిల్ రాజమౌళిని పులుచుకుని ఓ మాట చెప్పాడట.

 

 


కోప్పడటం వల్ల అవతలి వారు నిరుత్సాహపడతారని, అందువల్ల వారి నుండి మనక్కావాల్సింది రాబట్టుకోలేమని, అదీగాక కోప్పడడం వల్ల అవతలి వారిపై నియంత్రణ కోల్పోతామని చెప్పాడట. అప్పటి నుండి రాజమౌళి కోప్పడటం మానేసాడట. ఎప్పుడో పదేళ్ళ క్రిందట జరిగిన ఈ సంఘటనని రాజమౌళి గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: