ముంబై కి చెందిన ముద్దుగుమ్మ ఇలియానా మొదటిలో బిజినెస్ యాడ్స్ లకు మోడల్ గా పని చేసేది. కాలక్రమేణా ఆమె నటన శిక్షణ తీసుకొని సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించగా... 2006వ సంవత్సరంలో డైరెక్టర్ వై.వి.యస్.చౌదరి ఆమెను తన సినిమాలో హీరోయిన్ ఎంపిక చేశాడు. దేవదాసు అనే శీర్షికతో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ పోతినేని తొలిసారిగా నటించాడు. ఇలియానా, రామ్ పోతినేనిలకు దేవదాసు సినిమా మొదటిది కావడం... అది సంచలనాత్మక హిట్ కావడం గమనార్హం.


వాస్తవానికి ఇలియానా రామ్ పోతినేని ఇద్దరూ కలిసి ఎస్.జే భిక్షు రాజస్థాన్ నటనలో శిక్షణ తీసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రామ్ పోతినేని కంటే ఇలియానా ఒక సంవత్సరం పెద్దది. మొదటి సినిమాతోనే బాగా క్రేజ్ ని సంపాదించింది ఇలియానా స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లింది. తన మొట్ట మొదటి చిత్రమే తన కెరీర్ ని మార్చడం అనేది ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఎంత బడా స్టార్స్ అయినా... తొలి సినిమాతో క్రేజ్ ని సంపాదించలేరు. కానీ ఈమె విషయంలో అంతా మంచే జరిగింది. దేవదాసు చిత్రంలో నటించినందుకు గాను ఇలియానాకు ఉత్తమ నూతన నటీమణి ఫిలింఫేర్ అవార్డు లభించింది.


తదనంతరం ఇలియానా మహేష్ బాబు సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కేకిన పోకిరి చిత్రంలో నటించింది. ఈ చిత్రం అప్పటివరకు తెలుగు సినిమాలు సృష్టించిన రికార్డులన్నీ బద్దలు కొట్టి కనీవినీ ఎరుగని విజయం సాధించింది. దాంతో ఇలియానా క్రేజ్ కూడా తారాస్థాయికి చేరుకుంది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ సరసన రాఖీ సినిమాలో, రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన మున్నా సినిమాలో నటించి తన పాపులారిటీని బాగా పెంచేసుకుంది. ప్రస్తుతానికి ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు సన్నగిల్లి పోయినప్పటికీ బాలీవుడ్లో మాత్రం అవకాశాలు ఇప్పటికీ లభిస్తూనే ఉన్నాయి. రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోల సరసన కూడా ఇలియానా నటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: