టాలీవుడ్ ఇండస్ట్రీ లో అందరి స్టార్ హీరోల సరసన నటించిన శ్రియ శరన్ ప్రస్తుతం రష్యా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. 2000 సంవత్సరాల కాలంలో తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన శ్రియ శరన్ ఆ తర్వాత కూడా ఐటమ్ సాంగ్స్ లలో హాట్ సాంగులకు డాన్స్ వేసి అందరినీ బాగా అలరించింది. తెలుగు భాషని మినహాయించి ఆమె తమిళ హిందీ మలయాళం సినిమాల్లో కూడా నటించే దక్షిణ భారత దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. అమాయకపు మొహం, క్యూట్ ఫేస్ కలిగి ఉన్న శ్రియా శరణ్ వెండితెరపై మ్యాజిక్ చేస్తుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. శ్రియ కు అందం అభినయం నటనా ప్రతిభతో పాటు డాన్సింగ్ టాలెంట్ కూడా పుట్టుకతోనే వచ్చింది.


ముంబాయి నగరంలో స్త్రీ స్పా ఏర్పాటు చేసిన శ్రియ అందులో దివ్యంగులకు ఉపాధి కల్పించి తన దాతృత్వాన్ని చాటుకుంది. అక్కినేని నాగార్జున సరసన నేనున్నాను సినిమాలో అద్భుతంగా నటించిన శ్రియ... ఠాగూర్ చెన్నకేశవరెడ్డి, సంతోషం, నువ్వే నువ్వే, ఎలా చెప్పను, బాలు, సోగ్గాడు లాంటి చిత్రాలలో నటించింది. అయితే ఈ సినిమాలన్నీ ఆమెను బాగా పాపులర్ చేసాయి కానీ హై లెవెల్ స్టార్డమ్ మాత్రం ఆమెకు లభించలేదు. 2005వ సంవత్సరంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ కి జంటగా నటించిన శ్రియ శరన్ అశేషమైన స్టార్ డమ్ ని సంపాదించింది. ప్రభాస్ శ్రేయ శరణ్ మధ్య కొనసాగిన రొమాంటిక్ సన్నివేశాలు అందరినీ కట్టిపడేశాయి.


ఈ చిత్రంలో శ్రియ శరణ్ చాలా అందంగా కనిపించింది. సినీ విమర్శకులు సైతం శ్రియా శరన్ నటనకు ఫిదా అయిపోయారు అంటే అతిశయోక్తి కాదు. కీరవాణి సంగీతంలో రూపొందుకున్న శృంగారభరితమైన పాటలలో శ్రియ తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి చెమటలు పట్టించింది. ఈ చిత్రంలో ఆమె కాస్త బోల్డ్ అయిన క్యారెక్టర్ లో నటించింది. ఏది ఏమైనా తన అన్ని సినిమాలు ఒక ఎత్తయితే చత్రపతి మరో ఎత్తు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: