తెలుగు చిత్ర పరిశ్రమలో విజయశాంతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు.. ప్రేక్షకులు రాములమ్మ అని పిలుచుకుంటారు... సాధారణ ప్రజలు ఒక డైనమిక్ లీడర్ అంటారు... ఏదేమైనా మహిళా సాధికారత చాటుతూ దూసుకుపోతున్న గొప్ప మహిళ విజయశాంతి. అయితే విజయశాంతి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా దశాబ్దకాలం పాటు తన హవాని నడిపించిన విషయం తెలిసిందే. ఎంతో మంది హీరోల సరసన నటించిన విజయశాంతి ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. 

 

 

 అయితే ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ విజయశాంతి సినీ కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ఒసేయ్ రాములమ్మ. దర్శకరత్న దాసరి నారాయణ తెరకెక్కించిన ఒసేయ్ రాములమ్మ సినిమా... అప్పట్లో ఎంత సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దొరల పాలనలో మగ్గిపోతున్న ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుంది అనే దానిపై ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సంచలన విజయాన్ని నమోదు చేసి విజయశాంతి కెరియర్ ను  కీలక మలుపు తిప్పింది అని చెప్పాలి. 

 

 

 ఈ సినిమా తర్వాత విజయశాంతి ఎన్నో  ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు దర్శకనిర్మాతలకు  అందరికీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది విజయశాంతి. ఒసేయ్ రాములమ్మ సినిమా లో తన పవర్ఫుల్ నటనతో పాత్రకు జీవం పోసింది విజయశాంతి. అందుకే ఈ సినిమా తర్వాత విజయశాంతి కి  రాములమ్మ అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. చిన్నప్పుడే దొర చేత మానభంగం చేయబడిన విజయశాంతి పెద్దయిన తర్వాత ఎలా పగ  తీర్చుకుంటుంది. దొరతనాన్ని ఎలా పారద్రోలుతుంది అనే విషయాన్ని దాసరి నారాయణ ఒసేయ్ రాములమ్మ సినిమా లో చూపించి ప్రేక్షకులను మెప్పించాడు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: