తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ అనుష్క శెట్టి కి మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఇప్పటికీ అనుష్కస్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలో నటించి తనదైన అందాలతో ప్రేక్షకుల మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ... ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత  అనుష్క క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క భాగమతి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి మంచి విజయాన్ని అందుకుంది. 

 

 

 ఇక ఇప్పుడు నిశ్శబ్దం అనే మరో వైవిధ్యమైన కథతో కూడిన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది అనుష్క శెట్టి. అయితే అనుష్క సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది అన్న విషయం తెలిసిందే. సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అనుష్క శెట్టి ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కానీ ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్  ఇమేజ్ ను సంపాదించుకుంది అనుష్క. అరుంధతి సినిమాలో ప్రధానపాత్రలో నటించిన అనుష్క తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది అనే చెప్పాలి. 

 

 

 ఇక ఈ సినిమా అనుష్క కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అనుష్క నటన... అనుష్క అభినయం అందం అని ప్రేక్షకుల్ని మెప్పించాయి అని చెప్పాలి. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. కామంతో కళ్లు మూసుకుపోయి ఏకంగా పిశాచిగా మారిన కూడా తీరు మార్చుకోని ఒక మృగాన్ని అంతం చేయడానికి అరుంధతి చేసే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బుర పరిచాయి . ఇక ఈ సినిమాతో  అనుష్క కెరీర్ మొత్తం మారిపోయింది. ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించింది అనుష్క.

మరింత సమాచారం తెలుసుకోండి: