ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో బిజీ బిజీ గా దూసుకుపోతున్న హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తన కెరియర్ లో 100 స్పీడ్ తో దూసుకుపోతుంది రష్మిక మందన్న. చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎలాంటి అందాల ఆరబోత చేయకుండానే తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది అని చెప్పాలి. ఎప్పుడు పొట్టి పొట్టి డ్రెస్సుల జోలికి పోకుండా సాంప్రదాయమైన వస్త్రధారణ లోనే తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. మొదటి నుంచి కేవలం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 

 

 చలో సినిమా తో తెలుగు తెరకు పరిచయమై నాగశౌర్య తో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఇక మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడి కెరియర్ కు మంచి బాటలు పడ్డాయి అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. కానీ రష్మిక మందన కెరీర్ని కీలక మలుపు తిప్పిన సినిమా మాత్రం గీత గోవిందం సినిమా అనే చెప్పాలి. అప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతూ ఫుల్ ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత చేసిన గీతా గోవిందం  సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 

 

 ఇక ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. ఇక ఈ సినిమా సంచలన  విజయం సాధించడంతో రష్మిక మందన కెరీర్ కు కాస్త కీలక మలుపు తిరిగింది. ఏకంగా స్టార్ హీరోయిన్ రేస్ కి  మరింత దగ్గర అయిపోయింది రష్మిక మందన. దర్శక నిర్మాతలు అందరి చూపు ఈ అమ్మడు ఆకర్షించింది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసి సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన.

మరింత సమాచారం తెలుసుకోండి: