మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. రాజకీయాల్లోకి వెళ్లి పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ సినిమాల్లోకి వచ్చి చేసిన రెండు సినిమాలు 100కోట్ల షేర్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించారు. మరి.. ఇలాంటి క్రేజ్ ఉన్న మెగాస్టార్ తో ఓ టాప్ డైరక్టర్ సినిమా చేస్తే వచ్చే క్రేజ్ ఏస్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సౌత్ ఇండియా టాప్ డైరక్టర్ శంకర్మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా రొబోతోందనే ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

 

 

గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందనే వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తలన్నీ గాసిప్సే అని తేలిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ గురించి వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయాలని ఓ టాప్ ప్రొడ్యూసర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు మళ్లీ వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కూడా దశాబ్దం క్రితం రోబో ఆడియో ఫంక్షన్ లో శంకర్ తో సినిమా చేయలానే అభిలాషను వ్యక్తం చేశారు. కానీ.. వీరి కాంబోపై ఎప్పుడూ క్లారిటీ రాలేదు. చిరంజీవి, శంకర్ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

 

 

ప్రస్తుతం ఆచార్య సినిమాతో మెగాస్టార్ బిజీ. కమల్ హాసన్ తో భారతీయుడు2 తో శంకర్ బిజీ. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఈమధ్య తన స్థాయికి తగ్గ సినిమాలు తీయలేక ఫామ్ కోల్పోయి ఉన్నాడు శంకర్. పైగా శంకర్ తో సినిమా అంటే రెండు మూడేళ్లు టైమ్ కేటాయించాల్సిందే. ఈ నేపథ్యంలో శంకర్ తో చిరీంజవి సినిమా చేస్తారో లేదో అసలు ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: