ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్న వేళ ప్రభుత్వ యంత్రాంగాలు సతమతమవుతున్నాయి. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంటే... మరోవైపు ప్రాణ నష్టం పెరుగుతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చాలా దేశాలు తల్లడిల్లి పోతున్నాయి. భారతదేశంలో జనాభా సంఖ్య ఎక్కువ కాబట్టి... ఆరోగ్య రంగం కూడా అంతగా ఉత్తమమైనది కాదు కాబట్టి... ప్రధాని మోడీ లాక్ డౌన్ విధించడం తప్ప మరే ఇతర చర్యలు తీసుకోలేక పోతున్నాడు. దీంతో ఇళ్ల కే పరిమితమైన పేదవారి జీవితం వర్ణనాతీతంగా మారింది.


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవారి కోసం నిత్యావసర సరుకులను, కాస్త డబ్బులను ఇస్తున్నాయి కానీ అవి అందరికీ అందడం లేదు. అలాంటి వారిని ఆదుకునేందుకు చాలా మంది సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఎన్జీవో సంస్థలు, తదితర ధనికులు ముందుకు వస్తున్నారు. అందరినీ ఆదుకునేందుకు సీఎం, పీఎం లు ప్రత్యేకమైన విరాళ సంస్థలను ఏర్పాటు చేశారు అన్న సంగతి తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సీఎం ఫండ్ లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎంతో మంది వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయనిధి లకు ఎన్నో విరాళాలను అందజేశారు.


తాజాగా శిరిడి సాయి, నమో వెంకటేశాయ చిత్రాలను తెరకెక్కించిన ప్రొడ్యూసర్, ఏఎమ్ఆర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.మహేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన సీఎం సహాయనిధికి కోటి రూపాయలను విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఇంతకుముందు కూడా ఇతను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలను విరాళంగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలను దానం చేసిన మహేశ్ రెడ్డి ని అందరూ ప్రశంసిస్తున్నారు. సో, ఈ వారం హెరాల్డ్ విజేత మహేష్ రెడ్డి అని ప్రకటిస్తున్నాము. 

మరింత సమాచారం తెలుసుకోండి: