టెలివిజన్ రంగంలో యాంకర్ గా రాణిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది శ్రీముఖి. అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నరప్ గా గెలవడం జరిగింది. అటువంటి శ్రీముఖి త్వరలో కోర్టు బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి. ఇటీవల ఓ టీవీ షోలో బ్రాహ్మణ సామాజిక వర్గం కి సంబంధించి మనోభావాలు దెబ్బతీసేలా శ్రీముఖి వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గత కొన్ని రోజుల నుండి ఈ వార్త బాగా వైరల్ గా మారింది. దీంతో తాజాగా ఈ వార్తలపై శ్రీముఖి స్పందించింది. తనపై పెట్టిన కేసు చెల్లదు అని అంటుంది. తాను యాంకర్ మాత్రమే అని ఉద్దేశపూర్వకంగా ఎవరిని దూషించలేదు అని అయినా కానీ అది రెండు సంవత్సరాల క్రితం జరిగిన కార్యక్రమం అని చెప్పుకొచ్చింది.

 

ఎప్పుడో ఆ కార్యక్రమం టెలికాస్ట్ అయితే ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి అని అంటోంది. లాక్ డౌన్ సమయములో మళ్లీ ఆ ఛానల్ ప్రసారం చేసిన ఈ కార్యక్రమం చూసి బ్రాహ్మణ వర్గానికి చెందిన ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ శ్రీముఖి మీద ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఎప్పుడో పాతకాలంనాటి ప్రోగ్రాం అయినా పర్వాలేదు పోలీసులకు సహకరిస్తూ అని శ్రీముఖి ఓ వార్తా సంస్థకు తన కథనాన్ని ఇచ్చింది.

 

అయితే ఈ విషయంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు మాత్రం శ్రీముఖి బయట కాదు న్యాయస్థానంలో నిలబడి ఈ విషయాన్ని ఒప్పుకోవాలని అంటున్నారు. కాగా కార్యక్రమంలో శ్రీముఖి మరీ దారుణంగా దిగువస్థాయి మాటలతో డబుల్ మీనింగ్ డైలాగులతో కించపరచడం తో సదరు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శ్రీముఖి పై కేసు పెట్టినట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: