విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్.జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకై జరిగిన భారీ ప్రమాదం కలకలం రేపింది. పరిశ్రమ నుంచి లీక్ అయిన రసాయన వాయువు 3 కి.మీల మేర వ్యాపించి ఊపిరి ఆడకుండా చేసింది. దీనితో కొందరు ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. గ్యాస్ లీక్ కారణంగా చర్మంపై దద్దుర్లు కళ్లలో మంటలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. ఇక ఈ గ్యాస్ తీవ్రతకు జనాలు అంతా సృహ తప్పి పడిపోయారు. ఏం జరిగిందో తెలిసే లోపే రహదారులు ఇళ్లలో అస్వస్థతకు గురై సృహ తప్పారు. గ్యాస్ లీక్ అయ్యి అది పీల్చి చాలా మంది అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయారు. వీరిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రజలు తీవ్ర భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. మరి ఇంత పెను విషాదానికి కారణమైన గ్యాస్ ఏమై ఉంటుందన్న చర్చ మొదలైంది. సదురు ఎల్.జీ  కంపెనీ నుంచి ఏం లీక్ అయ్యిందనే దానిపై అధికారులు విచారణ జరిపారు. ఈ కంపెనీ నుంచి లీక్ అయ్యింది ‘పీవీసీ గ్యాస్’ లేదా ‘స్టెరిన్ గ్యాస్’ అని విశాఖ కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. 

 

ఈ ఘటనకు సంబంధించి పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషాద సంఘటనపై చిరంజీవి మరియు మహేష్ స్పందించారు. విశాఖలో విషవాయువు బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాము అన్నారు. ఆలాగే సంబంధిత అధికారులు దీని బారినపడ్డ వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో అస్వస్థతకు లోనైనవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. చికిత్స తీసుకుంటున్న వారికి మంచి వైద్యం అందించాలని వారు అధికారులను అభ్యర్ధించారు. అలాగే వైజాగ్ సిటీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అలాంటి నగరానికి ఇలా కావడం కలచివేసింది అన్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: