అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాధ, లై, పడిపడి లేచె మనసు.. చిత్రాలతో టాలెంటెడ్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు హను రాఘవపూడి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ను తన టేకింగ్ టెక్నిక్స్ తో ఆకట్టుకుంటాడు హను రాఘవపూడి. సక్సెస్ ట్రాక్ తక్కువగానే ఉన్నా మంచి సినిమాలు తీస్తాడనే పేరు ఉంది. ప్రస్తుతం ఈ డైరక్టర్ కు ఓ మంచి అవకాశం దక్కినట్టు సమాచారం. అగ్ర నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. మళయాళ సెన్సేషనల్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 

 

 

స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ మీడియా ఇంటరాక్షన్ లో వెల్లడించారు. తెలుగులో హీరోగా నటిస్తానని గతం నుంచి చెప్తున్న దుల్కర్ సల్మాన్ కు ఈ సినిమాతో తెలుగులో డైరక్ట్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ నటించాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు దుల్కర్. హను చెప్పిన కథ దుల్కర్ సల్మాన్ కు, అశ్వనీదత్ కు నచ్చిందని సమాచారం. దీంతో హను రాఘవపూడికి లక్కీ చాన్స్ దక్కినట్టే. ఓ అగ్ర నిర్మాణ సంస్థ నుంచి ఆఫర్ దక్కడం విశేషమే.

 

 

అశ్వనీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని గతం నుంచీ వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇంతవరకూ ఈ ప్రాజెక్టుపై ఎవరూ స్పందించ లేదు. ఇప్పుడు అశ్వనీదత్ నుంచే అఫిషియల్ న్యూస్ రావడంతో ఈ ప్రాజెక్టుపై బజ్ ఏర్పడుతోంది. దీంతో దుల్కర్ సల్మాన్ తెలుగు ఎంట్రీకి మంచి వేదిక సెట్టయినట్టే. పెద్ద బ్యానర్, టాలెంటెడ్ దర్శకుడు ఉండడంతో దుల్కర్ చేసే సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: