మా టీవీ ఛానల్ లో ప్రసారమైన కలర్స్ ప్రోగ్రాం లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన స్వాతి తన క్యూట్ వాయిస్ తో నాగార్జున ఉదయ్ కిరణ్ లాంటి సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. పదహారేళ్ళ వయసులోనే తాను మా టీవీ కార్యక్రమం ద్వారా తన వాక్చాతుర్యాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దర్శక నిర్మాతలు కూడా స్వాతి ని చూసి బాగా ముచ్చటపడి సినీ అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన డేంజర్ సినిమా ద్వారా తొలిసారిగా వెండితెరపై కనిపించింది స్వాతి.


సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో హీరోయిన్ త్రిష కు సోదరిగా నటించి అందర్నీ బాగా ఎంటర్టైన్ చేసింది. అప్పటికే ఆమెకు బాగానే గుర్తింపు లభించింది. ఆపై తమిళ హీరో జై సరసన అనంతపురం 1980 సినిమాలో నటించింది. ఈ సినిమా మధురై పట్టణంలో 1980 లో చోటుచేసుకున్న ప్రేమ కథా నేపథ్యంలో కొనసాగుతుంది. ఐతే ఈ చిత్రంలో పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ లో స్వాతి నటించగా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.


సినిమా తర్వాత వచ్చిన అష్టా చమ్మా లో స్వాతి కథానాయకి పాత్రలో నటించింది. ఈ సినిమాలో నాని తొలిసారిగా కథానాయకుడిగా కనిపించాడు. ఈ చిత్రంలో కలర్స్ స్వాతి హీరో నాని మధ్య కొనసాగే సన్నివేశాలు అందరినీ బాగా అలరించాయి. ఈ సినిమా ఘన విజయం సాధించగా... కలర్స్ స్వాతికి కూడా ఎనలేని పాపులారిటీ వచ్చింది. ఈ చిత్రంలోని ఆమె నటనకు గాను ఉత్తమ నటి గా నంది పురస్కారం లభించింది. దాంతో అప్పటి వరకు సాధారణ నటిగా కొనసాగిన స్వాతి... అష్టాచమ్మా సినిమా తర్వాత దాదాపు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.


2008వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాలో హీరోయిన్ ఇలియానాకు స్వాతి డబ్బింగ్ చెప్పింది. ఆపై కొన్ని సినిమాలలో ఆమె నటించింది కానీ అవేమీ అంతగా ఆడలేదు. 2013, 2014 సంవత్సరాలలో హీరో నిఖిల్ తో కలసి స్వామిరారా, కార్తికేయ లాంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో తక్కువగా తమిళంలో ఎక్కువగా సినిమాలు తీస్తూ తమిళ ప్రజలను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: